సినీనటి ,తెలుగు సినిమాలలో తల్లిగా ఎక్కువ పాత్రలు చేసిన అన్నపూర్ణమ్మ కుమార్తె కీర్తి ఈరోజు బంజారాహిల్స్ లోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తనకు పెళ్లయి ఒక పాప కూడా ఉంది.
సినీనటి అన్నపూర్ణమ్మ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. చిరంజీవి ,బాలకృష్ణ, నాగార్జున ,వెంకటేష్ తరంలో దాదాపు అందరూ హీరోలకు తల్లిగా నటించారు. ఇటీవల సరైనోడు చిత్రంలో అల్లు అర్జున్ నానమ్మ గా నటించారు. అయితే సినీ పరిశ్రమలో ఎంతోమందికి తల్లిగా నటించినప్పటికీ తనకు స్వంత కూతురు లేకపోవడంతో అప్పట్లో పాపను దత్తత తీసుకుని చదివించి పెళ్లి కూడా చేశారు. ఆ అమ్మాయి కీర్తి ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నారు.
అయితే ప్రాథమిక వివరాలను బట్టి ఆరోగ్య సమస్యలే ఆత్మహత్యకు కారణం అని తెలుస్తోంది. అదీకాక కీర్తి కి ఒక పాప ఉంది . ఆ పాప కి మాటలు రాకపోవడం వంటి కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అని, అన్నపూర్ణమ్మ గారు కూడా మనవరాలికి మాటలు రాకపోవడం అన్న సమస్య గురించి ఎక్కువగా బెంగ పెట్టుకోవద్దు అని కీర్తికి చెప్తూ ఉండేదని, అయితే డిప్రెషన్ కి లోనైన కీర్తి ఇంతలోనే ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. అయితే ఆత్మహత్య కి ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయేమోనని దర్యాప్తు కూడా చేస్తున్నారు