బెంగళూరు: అలనాటి హీరోయిన్ కృష్ణకుమారి(83) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె ఈ రోజు ఉదయం బెంగుళూరులో తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఆమె నటించారు. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు సహా పాత తరం అగ్రహీరోలందరితోనూ నటించారు. ఆమె మరణించారన్న వార్త తెలియగానే సినిమా ప్రముఖులు, అభిమానులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.కృష్ణకుమారి పశ్చిమ బెంగాల్‌లోని నైహతిలో1933, మార్చి 6న జన్మించారు. షావుకారు జానకి ఈమెకు పెద్దక్క. సుమారు 110 పైగా తెలుగు సినిమాలలో నటించారు. బెంగళూరుకు చెందిన అజయ్ మోహన్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. వీరికి దీపిక అనే కుమార్తె ఉన్నారు.