సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వానికి రూ. పది లక్షల నష్టం కలిగించారని… దానికి సంబంధించి పదిహేను రోజుల్లోగా వివరణ ఇవ్వాలని లేకపోతే తప్పు చేసినట్లుగా భావించి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు కూడా ఇప్పుడు సీనియర్ అధికారుల్లో చర్చనీయాంశమయింది. 2017-18లో భద్రత పరికరాల కొనుగోలు ప్రక్రియ వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.10 లక్షల నష్టం వాటిల్లిందని సీఎస్ నోటీసులు జారీ చేశారు. డీజీపీ క్యాడర్లో ఉన్న సీనియర్ అధికారిపై అదే పనిగా కే్సులు నమోదు చేసి.. చాలా కాలం పాటు సస్పెన్షన్‌లో ఉంచి.. జీత భత్యాలు కూడా ఇవ్వకుండా.. చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు అభియోగాలు నమోదు చేయాల్సిన పరిస్థితి వచ్చేసరికి..రూ. పది లక్షల నష్టం కలిగించారంటూ.. నోటీసులు జారీ చేయజమే అధికార వర్గాల్లో చర్చనీయాంశం కావడానికి కారణం
ఆయనను ఈ ఏడాది ఫిబ్రవరి ఎనిమిదో తేదీన సస్పెండ్ చేశారు. అప్పటి వరకూ పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయనపై సీఐడీ కేసులు కూడా నమోదు చేశారు. ఆ సమయంలో.. ఏబీ వెంకటేశ్వరరావుపై ప్రధానంగా ఐదు అభియోగాలను .. పేర్కొన్నారు. ఇందులో మొదటిది గ్రాస్ మిస్ కండక్ట్. క్రిటికల్ ఇంటలిజెన్స్ అండ్ సర్వైలెన్స్ కాంట్రాక్ట్‌ను ఓ ఇజ్రాయెల్ కంపెనీతో కుమ్మక్కయి.. అక్రమమంగా తన కుమారుడికి చెందిన కంపెనీకి ఇప్పించుకున్నారనేది మొదటి అభియోగం. ఇది నేరుగా విదేశీ రక్షణ తయారీ సంస్థతో నేరుగా సంబంధాలు పెట్టుకోవడమేనని.. ఇది సర్వీస్ ఎథికల్ కోడ్‌ను ఉల్లంఘించడమేనని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు.. అలాంటి పరికరాలేమీ కొన్నట్లుగా ప్రభుత్వం చెప్పడం లేదు. కీలకమైన సమాచారాన్ని ఇజ్రాయెల్ కంపెనీలకు పంచుకున్నారని.. ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇంటలిజెన్స్ ప్రోటోకాల్స్ అండ్ ప్రొసీజర్స్ ఉద్దేశపూర్వకంగా వెల్లడించారని ప్రభుత్వం అభియోగం మోపింది. అలాగే ఎక్విప్ మెంట్‌ను కూడా సబ్ స్టాండర్డ్‌వి కొన్నారని .. స్టేట్ సీక్రెట్స్‌ను యాక్సెస్ చేశారని… దాని వల్ల లాభం పొందారని కూడా ప్రభుత్వం ఆరోపిస్తోంది. కానీ అలాంటి సబ్ స్టాండర్డ్ ఎక్విప్ మెంట్ కొన్నట్లుగా ప్రస్తుతం నోటీసులో లేదు.
దీనిపై ఏబీ వెంకటేశ్వరరావు న్యాయపోరాటం చేశారు. హైకోర్టులో సస్పెన్షన్ ఎత్తివేత ఆర్డర్స్ తెచ్చుకున్నారు. కానీ సుప్రీంకోర్టు సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ.. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై.. సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయనపై దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను వెంకటేశ్వరరావుకు సమర్పించాలని ప్రభుత్వానికి సూచించింది. నిబంధనల ప్రకారం.. ఎప్పుడో అభియోగాలు నమోదు చేయాల్సి ఉంది. కానీ చేయలేదు. సస్పెన్షన్ ఎత్తివేస్తే సాంకేతిక సమస్యలు వస్తాయనిసుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తాను ఇంటలిజెన్స్ చీఫ్ పదవిలో ఉండగా ఎలాంటి పరికరాలు కొనలేదని .. కొనుగోళ్ల కమిటీలో కూడా తాను లేనని ఆయన చెబుతున్నారు. ఇప్పుడు ఆయనపై నమోదు చేసిన అభియోగాలను ప్రభుత్వం నిరూపించాల్సి ఉంది. లేకపోతే.. సీనియర్ అధికారులు చిక్కుల్లో పడే అవకాశాలు ఉన్నాయి.