సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పీవీ సునీల్ కుమార్ చాలా తీరికగా ఉన్నట్లుగా ఉన్నారు. సీఐడీ చీఫ్ పదవి నుంచి తప్పించి ఫైర్ డిపార్టుమెంట్ కు పంపడంతో పని లేదేమో కానీ.. తీరిగ్గా దళిత సినిమాలకు అవార్డులివ్వలేదని ఇది దళితుల్ని అవమానించడమేనని రివ్యూలు రాస్తున్నారు. గతంలో పలాస సినిమాకు కాకుండా కలర్ ఫోటోకు ఇచ్చారని.. ఇప్పుడు జైబీమ్ కు కాకుండా మిగతా సినిమాలకు ఇచ్చారని ఆయన ఆవేదన. ఇది దళితుల్ని అవమానించడమేనని… మాదిగలు వారు చేసిన చెప్పులో వారు కొట్టుకోవాలని పెద్దపెద్ద మాటలు కూడా మాట్లాడారు. ఇదంతా ఆయన సోషల్ మీడియాలో స్పందన.
దళితులకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఈ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లో స్పందనలు రాలేదే !
ఆయన ఆవేశం చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. సినిమాలో అవార్డులు వచ్చినా రాకపోయినా ఆ సినిమాలు ఇప్పటికే హిట్ అయ్యాయి. ప్రజలు ఆదరించారు. జై భీంకు నేషనల్ అవార్డు ఇచ్చినంత మాత్రాన దళితులకు గౌరవం ఇచ్చినట్లు కాదా.. అవార్డు ఇవ్వనంత మాత్రాన అగౌరవపర్చినట్లు కాదు. కానీ జైభీం మంచి సినిమా అని అందరూ తీర్మానించారు. అదొక్కటే కాదు తమిళంలో వచ్చిన సార్పట్ట తో మరికొన్ని మంచి సినిమాలకూ అన్యాయం జరిగిందంటున్నారు. చాలా వరకూ దళిత వాదం వాటిలో ఉండవచ్చు కానీ.. అవార్డులివ్వనంత మాత్రాన .. దళితులకు అన్యాయం జరిగినట్లుగా పీవీ సునీల్ వాదించడం మత్రం బహు చిత్రంగానే ఉందని సెటైర్లు పడుతున్నాయి.
తమిళ సినిమాకు అవార్డులివ్వకపోతే ఇక్కడ ఆవేశం ఎందుకు ?
ఏపీలో ఆయన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్. ఇంతగా సినిమాల మీద స్పందించే ముందు నిజంగా దళితులకు అన్యాయం జరిగినప్పుడు ఒక్క మాట ఎందుకు మాట్లాడలేదో ఆయనను దళితులు ప్రశ్నిస్తున్నారు. దళితులపైనే అట్రాసిటీ కేసులు పెట్టినప్పుడు ఆయన స్పందించలేదు. డాక్టర్ సుధాకర్ విషయం అంత్జాతీయ పత్రికల్లో హాట్ టాపిక్ అయింది కానీ అది దళితులకు జరిగిన అన్యాయంగా పీవీ సునీల్ కు అనిపించలేదు. దళిత యువకుడి శిరోముండనం… దళిత యువకుడు కిరణ్ హత్యలు పట్టించుకోలేదు. ఇవన్నీ వ్యక్తిగత అంశాలు అనుకున్నా.. అమరావతిలో దళిత రైతులకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడలేదు. అమరావతిలో అసైన్డ్ భూములపై దారుణమైన కుట్రలు చేసి వారికి కౌలు కూడా ఆపేశారన్న దానిపై ఆయన మాట్లాడలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే పివీ సునీల్.. ఏపీలో నిజంగా దళిత వర్గాలకు జరిగిన అన్యాయలనూ ప్రశ్నించేందుకు ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు ఓ సినిమా అదీ కూడా తమిళనాడు సినిమా కు అవార్డులు ఇవ్వలేదని.. అది దళితుల్ని కించపర్చడమేనని తెరపైకి వచ్చారు.
ఇప్పటి వరకూ పీవీ సునీల్ ఎంత మంది దళిత బాధితులకు అండగా ఉన్నారు ?
దళితులకు నిజంగా అన్యాయం జరుగుతోంది.. దళితులుగా రిజర్వేషన్లు పొంది ఉన్నత స్థానానికి ఎదిగి… అదే వాదంతో ఉన్నట్లుగా చెప్పుకుంటారు కానీ..బాధితులకు కనీస సాయం చేయడానికి.., మద్దతుగా ఉండటానికి కూడా మందుకు రాని ఇలాంటి వారి వల్లే. కానీ వీరే మళ్లీ అసలు దళితుల జీవితాలకు సంబంధం లేని సినిమాలపై మాత్రం దూకుడుగా స్పందిస్తారు. పీవీ సునీల్ దళిత సర్టిఫికెట్ తో .. ఐపీఎస్ అయ్యారు. ఇప్పుడు అదే సర్టిఫికెట్ ను ప్రయోగించి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. అందుకే హడావుడి చేస్తున్నారు. కానీ తనకు వచ్చిన పదవితో ఎంత మందికి దళితులకు న్యాయం చేశారో … అన్యాయమైపోయిన వారికి అండగా నిలిచారో తనను తాను ప్రశ్నించుకుంటే.. తాను చేసిన.. చేస్తున్న తప్పులేమిటో విశ్లేషించుకునే అవకాశం రావొచ్చు.