తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరుగా సాగుతున్నాయి. పలువురు సీనియర్ నేతలు… కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. వీరిలో చాలా మంది టిక్కెట్లు ఆశిస్తున్న వారే. ఈ రోజు… టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారు. డి.శ్రీనివాస్‌తో పాటు టీఆర్ఎస్ బహిష్కృత నేత ఎమ్మెల్సీ రాములు నాయక్, గజ్వెల్మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిలు కాంగ్రెస్ కండువాలు కప్పుకోనున్నారు. గతంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ డీఎస్‌ను టీఆర్ఎస్నుంచి సస్పెండ్‌చేయాలని జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు అంతా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అప్పటి నుంచి ఆయన టీఆర్ఎస్కు దూరంగా ఉంటున్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌సైతం జోక్యం చేసుకోకపోవడంతో డీఎస్ పార్టీ వీడక తప్పలేదు.
డీఎస్ రాకను కాంగ్రెస్‌పార్టీలోని కొందరు సీనియర్ నేతలు వ్యతిరేకిస్తున్నా.. పాత పరిచయాలతో డీఎస్మార్గం సుగమం చేసుకున్నారు. డీఎస్ రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెట్టకూడదన్న షరతు మీద పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. ఇక ఎమ్మెల్సీ రాములు నాయక్.. కూడా టిక్కెట్ ఆశించి పార్టీలో చేరేతున్నారు. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి కూడా.. మెదక్ అసెంబ్లీ టిక్కెట్ ఆశ చూపి పార్టీలో చేర్చుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలి కాలంలో.. కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్లంతా.. టిక్కెట్ కోసం వచ్చిన వాళ్లే. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నుంచి రమేష్ రాథోడ్ దగ్గర్నుంచి.. నల్లగొండ జిల్లా దేవరొండకు చెందిన బాలూనాయక్ వరకూ అందరూ టిక్కెట్ల కోసమే పార్టీలో చేరారు. వీరందరికి టిక్కెట్లు సర్దుబాటు చేయగలరా..? ఒక వేళ సర్దుబాటు చేస్తే… మిగిలిన పార్టీ నేతలు ఊరుకుంటారా..? వాళ్లంతా వెళ్లి టీఆర్ఎస్ పార్టీలో చేరిపోరా…?
తెలంగాణ రాష్ట్ర సమితికి ఇప్పుడు అసంతృప్తుల బాధ ఉంది. కానీ.. ఇక పెరిగే అవకాశం లేదు. ఎందుకంటే.. కేసీఆర్.. పూర్తిగా టిక్కెట్లను ఖరారు చేశారు. మార్పులు ఉండే అవకాశం లేదని స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ఆ కారణంగా ఉండేవాళ్లు ఉంటున్నారు. లేని వాళ్లు లేదు. కానీ.. కాంగ్రెస్ పార్టీ ఇంకా పొత్తులు. అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఇవి ఖరారయిన తర్వాతే… కాంగ్రెస్ కు అసలు అసంతృప్తి సినిమా కనిపించే అవకాశం ఉంది.