వైఎస్ జగన్మోహన్ రెడ్డి… జాతీయ స్థాయిలో పాటిస్తున్న విధానాన్నే అచ్చంగా… ఆంధ్రప్రదేశ్లో కూడా పాటిస్తున్నారు… ఓ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఆయన.. ఇటీవల ఓ కుటుంబ సమావేశం నిర్వహించారు. ఇందులో .. కేవలం కుటుంబసభ్యులే కాదు… ఆయన దన్నుతో టిక్కెట్ దక్కించుకున్న వారు కూడా.. వచ్చారు. అందరూ కలిసి ఏకగ్రీవంగా ఓ నిర్ణయం తీసుకున్నారు. ఏది ఏమైనా ఈ సారి.. అధికార పార్టీలోనే ఉండి తీరాలనేది.. ఆ నిర్ణయం. అదేంటి.. వారి పార్టీ గెలిస్తే.. ఆటోమేటిక్గా అధికార పార్టీ వాళ్లు అవుతారు కదా.. అనే డౌట్ అందరికీ వస్తుంది. కానీ… ఆ మాత్రం చాయిస్ కూడా… ఆ సీనియర్ నేత ఇవ్వదల్చుకోలేదు. గెలిస్తే .. నో ప్రాబ్లం.. కానీ ఫలితం తేడా వస్తే మాత్రం… అధికార పార్టీకి మారిపోవాలన్నదే ఆయన సూత్రం. ఆయన ఉద్దేశాన్ని కుటుంబసభ్యులు, ఆయన అండతో పోటీ చేసిన వారు… అర్థం చేసుకున్నారు. తలలూపారు.
నిజానికి ఆ సీనియర్ నేత.. ఓ సందర్భంలో… చాలా ఎత్తుకు ఎదిగిపోయారు. ఉమ్మడి రాష్ట్ర అత్యున్నత పదవికి ఆయన రేసులో ప్రధానంగా ఉన్నారన్న చర్చ కూడా వచ్చింది. కానీ.. మిస్సయ్యారు. ఆ దెబ్బతో ఆయన అథంపాతాళానికి పడిపోయారు. ఎలాగోలా.. వేరే పార్టీలో చేరినా… అక్కడ ఆయన నియోజకవర్గ స్థాయికే పరిమిమతయ్యారు. ఆయన సీనియార్టీనే ఆయనకు గుదిబండగా మారింది. చివరికి అనుకున్న వాళ్లందరికీ టిక్కెట్లు ఇప్పించుకోలేకపోయారు. కానీ రాజకీయాల్లో రాటుదేలిన వ్యక్తిగా.. చివరికి.. పార్టీ మార్పు వార్తలను సృష్టించి .. చివరికి.. కొంత మేర అసెంబ్లీ టిక్కెట్లు మాత్రం తన కుటుంబంతో పాటు… తన శిష్యులు ఆరుగురు పోటీలో ఉండేలా చూసుకున్నారు. వారంతా గెలుస్తారని… వారితోనే తాను రాజకీయం చేయబోతున్నానని ఇప్పటికే మీడియాకు లీకులు ఇస్తున్నారు.
ఏపీకి ప్రత్యేకహోదా ఎవరు ఇస్తే.. వారికే .. తమ ఎంపీలు మద్దతు పలుకుతారని.. జగన్మోహన్ రెడ్డి… ఎన్నికల తర్వాత.. ఎలాంటి పరిస్థితి వచ్చినా.. తనకు అనుకూలంగా మల్చుకోవడానికి ఓ ఆప్షన్ పెట్టుకున్నారు. ఇదే విధానాన్ని ఆ ఉత్తరాంధ్ర దిగ్గజ నేత కూడా.. పాటిస్తున్నారు. అధికారంలోకి వచ్చే పార్టీనే తన పార్టీ అన్నట్లుగా… ఉంటున్నారు. అంతకు ముందు పదేళ్ల పాటు అధికారాన్ని అనుభవించి… గత ఐదేళ్లుగా… ఆయనకు అధికారం లేకపోయేసరికి..గందరగోళంగా మారిపోయిందంటున్నారు. ఈ సారి… అలాంటి పరిస్థితి లేకుండా ముందుగానే… జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏ పార్టీ గెలిస్తే.. అదే తన పార్టీ అంటున్న ఆ ఉత్తరాంధ్ర నేత ఆశ నెరవేరుతుందా..? గెలిచే పార్టీ ఆయనను ఆహ్వానిస్తుందా..? ఒక వేళ ఉన్న పార్టీనే గెలిస్తే… ఆయనకు ఉన్నత పదవి ఏమైనా దక్కుతుందా..? అన్న చర్చలు ఇప్పుడు ఆయన జిల్లాలోనే జోరుగా సాగుతున్నాయి.