జగన్ ఏలుబడిలో ఓ వెలుగు వెలిగిన ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి వ్యవహారాలు ప్రభుత్వం మారాక ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సజ్జలతో అంటకాగి పూర్తిగా వైసీపీ సేవలో తరించిన ధనుంజయ రెడ్డి బాగానే ప్రయోజనం పొందినట్లుగా తెలుస్తోంది. ఆయన భార్యను డిప్యూటేషన్ పై అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ పరిధిలోని కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (అప్కాస్ట్ ) సభ్య కార్యదర్శిగా నియమించేశారు.
ధనుంజయ రెడ్డి భార్య అపర్ణ..హైదరాబాద్ జేఎన్టీయూలో ప్రొఫెసర్. వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ సేవలో తరించిన ధనుంజయ రెడ్డికి ప్రభుత్వ విభాగాల్లో ఊహించని విధంగా ప్రాధాన్యత పెరగడంతో…ధనుంజయ రెడ్డి తన భార్యను ఎస్వీయూలో ప్రొఫెసర్ గా నియమించేలా చూసుకున్నారు. ఆ తర్వాత డిప్యూటేషన్ పై ఆమెను అప్కాస్ట్ సభ్య కార్యదర్శిగా నియమించేశారు. సీఎంవోలో ధనుంజయ రెడ్డి కీలకంగా ఉండటంతో ఇదే అదునుగా ఆయన భార్య సైతం అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి.
అప్కాస్ట్ లో శాస్త్ర సాంకేతిక రంగంపై అవగాహనా పెంచే కార్యక్రమాలను కాకుండా సివిల్ ఇంజినీరింగ్ పనులపైనే అపర్ణ ఫోకస్ పెట్టారన్న విమర్శలు ఉన్నాయి. ఇందులో భాగంగా ఆమె అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. రాజమహేంద్రవరం బొమ్మూరులో 15 కోట్లతో నిర్మించిన ఎస్ఆర్టీసీ గ్రౌండ్ లెవల్ కంటే 20అడుగుల లోతులో ఉంది. ఈ స్థలం నిర్మాణాలు శ్రేయస్కరం కాదని ఎక్స్ పర్ట్స్ కమిటీ తేల్చినా ఆమె మాత్రం అందుకు విరుద్దంగా పనులు చేపట్టాలన్ని అధికారులపై ఒత్తిడి తెచ్చారని, దాంతో నిబంధలకు విరుద్దంగా భవన నిర్మాణాలు చేపట్టారని సమాచారం.