భవిష్యత్‌లో కరోనా రాని వాళ్లంటూ ఎవరూ ఉండరని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్న మాటలు నిజం అవుతున్నాయి. ఏపీలో ఇప్పటి వరకు ఇరవై శాతం మందికి అంటే.. దాదాపుగా కోటి మందికి పైగా కరోనా వచ్చిందట. అలాగే పోయిందట. జగన్ ఈ విషయాన్ని కూడా చెబుతూ ఉంటారు. వచ్చింది .. పోయింది కూడా ఎవరికీ తెలియదని. దానికి తగ్గట్లుగానే.. కొత్త విషయం వెల్లడయింది. వా కోవిడ్–19 వైరస్ ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన సీరో సర్వైలెన్స్ సర్వే నిర్వహించారు. మనిషి శరీరంలో డెలవప్ అయిన యాంటీ బాడీస్ ఆధారంగా..వైరస్ రాకపోకలను.. గుర్తించేందుకు సీరో సర్వైలెన్స్ సర్వే చేశారు.
జిల్లాకు ఐదు వేల శాంపిల్స్ అదీ కూడా.. కరోనా టెస్టులు చేయించుకోని వారివి సేకరించి ఫలితాలను విశ్లేషించి.. ఈ కోటి మందికి కరోనా లెక్క ప్రకటించారు. పురుషుల్లో 19.5 శాతం, మహిళల్లో 19.9 శాతం మందికి కరోనా వచ్చిందని .. కరోనా వచ్చిపోయినవారిలో 20.3 శాతం మంది హైరిస్క్‌లో ఉన్నారు. అంటే.. దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్నాయి. అయినప్పటికీ.. వీరిపై కరోనా ఎలాంటి ప్రభావం చూపలేదు. వచ్చిందన్న విషయం తెలియకుండానే.. వెళ్లిపోయింది.
అదే సమయంలో ఏపీలో గత ఇరవై నాలుగు గంటల్లో నిర్వహించిన కరోనా పరీక్షల్లో కొత్తగా 10,175 కరోనా కేసులు నమోదయ్యాయి. 68 మంది చనిపోయారు. మొత్తం మరణాలు 4,702కు చేరుకున్నాయి. మొత్తం ఇప్పటివరకు ఏపీలో 43 లక్షల 80వేల టెస్టులు నిర్వహించినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఆ కోటి మందిలో వీరు లేరు..వీరు రెగ్యులర్ టెస్టుల్లో బయటపడుతున్నరోగులు మాత్రమే.