తెలుగు చిత్రసీమలో తెలుగు అమ్మాయిల్ని పెద్దగా పట్టించుకోరు అంటుంటారు. ఆ హీరోయిన్ కూడా అచ్చ తెలుగు అమ్మాయే. కాకపోతే… మంచి అవకాశాలనే దక్కించుకొంది. ఒకట్రెండు హిట్లు అందుకొంది. తెరపై చాలా పద్ధతిగా.. కనిపించింది. ఇప్పుడైతే… ఆమెకు అవకాశాలు లేవు. ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు కూడా. అయితే… ఓ రాజకీయ నాయకుడితో కాస్త సన్నిహితంగా ఉంటోంది. ఆ నేత కాసినోలతో బాగా సంపాదించాడని ప్రసిద్ధి పొందాడు. వందల కోట్లు సంపాదించాడని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆయనతో… సదరు కథానాయిక టచ్చింగ్ లో ఉంటుందోని టాక్. అందుకు గానూ.. హైదరాబాద్ లో ఓ ఖరీదైన గేటెడ్ కమ్యునిటీలో రూ.7 కోట్లతో ఓ విలాసవంతమైన ఫ్లాట్ గిఫ్టుగా ఇచ్చేశాడని టాక్. ఇప్పుడు… ఆ ఇంట్లోనే హీరోయిన్ నివాసం ఉంటోందట. ఇన్నాళ్లూ సినిమాల ద్వారా ఏమీ సంపాదించలేని ఈ కథానాయిక సడన్ గా ఏడు కోట్ల ఫ్లాట్ కు ఓనర్ అయిపోవడం చూసి మిగిలిన స్నేహితులు, సన్నిహితులు ఆశ్చర్యపోతున్నారు. ఫ్లాట్ కొని పెట్టడం ఒక ఎత్తయితే.. తనకు తెలిసిన దర్శక నిర్మాతలకు ఫోన్లు చేసి.. ఈ కథానాయికకు ఆఫర్లు ఇవ్వమని రికమెండ్ చేస్తున్నాడట. అలా మొత్తానికి అటు సినిమాలు, ఇటు ఫ్లాటూ.. రెండూ పట్టేసింది ఈ కథానాయిక.