ఈ శుక్రవారం బాక్సాఫీసు దగ్గర కొంచెం హడావుడి కనిపించింది. `తిమ్మరుసు`, `ఇష్క్` ఈ రెండు సినిమాలూ ఒకేసారి విడుదల కావడంతో టాలీవుడ్ కి కాస్త ఊపొచ్చింది. ఈ సినిమాల టాక్, వసూళ్లు పక్కన పెడితే, టాలీవుడ్ కి ఇది కమింగ్ బ్యాక్. ఈవారం కూడా కొత్త సినిమాలు రాబోతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఏడు సినిమాలు. ఆగస్టు 6న సరిగ్గా ఏడు సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. అయితే అవన్నీ చిన్న సినిమాలే. అందులో కాస్త హైప్ ఉన్న సినిమా `ఎస్.ఆర్.కల్యాణమండపం`. ఈ సినిమాలోని పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది. ట్రైలర్ కూడా బాగుండడంతో… ఈ సినిమాపై ఫోకస్ పడింది. వీటితో పాటు మ్యాడ్, ముగ్గురు మొనగాళ్లు, మెరిసే మెరిసే, క్షీర సాగర మధనం, రావణలంక, ఇప్పుడు కాక ఇంకెప్పుడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అయితే.. `కల్యాణమండపం`కి తప్ప.. దేనికీ సరైన ప్రచారం లేదు. ఏపీలో ఇప్పటికి సగం థియేటర్లే తెరిచారు. 6 నుంచి ఏపీ థియేటర్లు పూర్తిగా మూతబడతాయని, అక్కడ థియేటర్లు తెరచుకునే అవకాశాలు చాలా తక్కువని ప్రచారం సాగుతోంది. అంటే.. ఈ 7 సినిమాల టార్గెట్ తెలంగాణ మాత్రమే అన్నమాట.