వెస్ట్ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ పై రాజ్ భవన్ లో పని చేసే మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేసింది. ఉద్యోగం పేరిట ఆనంద్ బోస్ తనను లైంగికంగా వేధించారంటూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. కోల్ కత్తాలోని హేర్ స్ట్రీట్ పోలీసు స్టేషన్ లో మహిళ ఫిర్యాదు చేసింది.
మహిళా ఉద్యోగి లైంగిక ఆరోపణలపై గవర్నర్ సీవీ ఆనంద బోస్ స్పందించారు. తనపై లైంగిక ఆరోపణలను ఖండించారు.’కల్పిత కథనాల్ని చూసి భయపడను.చివరికి సత్యమే గెలుస్తుంది. ఈ ప్రయత్నం ద్వారా ఎవరైనా రాజకీయంగా ప్రయోజనం పొందాలనుకుంటే వారిష్టం అని పేర్కొన్నారు. తనపై ఎలాంటి ఆరోపణలు చేసినా రాష్ట్రంలో అవినీతి,హింసపై నా పోరాటాన్ని ఎవరూ ఆపలేరు’ అని స్పష్టం చేశారు.
ఈ విషయంపై తీవ్ర దుమారం రేగడంతో తృణమూల్ కాంగ్రెస్ స్పందించింది. ఈ విషయంలో ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు జోక్యం చేసుకోవాలన్నారు. ప్రధాని రాష్ట్ర పర్యటన నేపథ్యంలో గవర్నర్ పై లైంగిక ఆరోపణలు రావడం బీజేపీకి షాక్ ఇచ్చాయి.