అధికారంలో ఉన్నప్పుడు పెద్ద నోరేసుకుని ప్రజల మీద పడిపోయిన నేతలకు ఇప్పుడు అసలు సమస్యలు వస్తున్నాయి. చివరి రెండేళ్లు మంత్రి పదవి ఇచ్చారని చెప్పి దాన్ని అడ్డం పెట్టుకుని అన్ని రకాల పనులు చేసిన మేధావి మంత్రి మెరుగు నాగార్జునపై ఓ మహిళ చేసిన ఫిర్యాదుతో కేసులు నమోదయ్యాయి. అది కూడా అత్యాచారం కేసు. తనకు ఉద్యోగం లేదా కంట్రాక్టు పనులు ఇప్పిస్తానని రూ. 90 లక్షలు వసూలు చేయడమే కాకుండా నాలుగు సార్లు అత్యాచారం చేశాడని ఆ మహిళ తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మంత్రిగా ఉన్నప్పుడు మెరుగు నాగార్జున తాడేపల్లి పరిధిలో ఉండే కుంచనపల్లి గ్రామంలో ఓ అపార్టుమెంట్ నుంచే ఇలాంటి పనులు చేసేవారు. అధికారం పోయాక ఆమె తన డబ్బులు అయినా ఇవ్వాలని అడుగుతూంటే స్లోపాయిజన్ ఇచ్చి చంపుతానని బెదిరిస్తున్నారు. గతంలో ఇలాగే ఓ గిరిజన టీచర్ ను చంపేశామని వారన్నట్లుగా ఆ మహిళ చెబుతోంది. ఇప్పుడు ఆ గిరిజన టీచర్ ఎవరు అన్నది కూడా పోలీసులు ఆరా తీసే అవకాశం ఉంది.
తనపై కుట్ర జరుగుతోందని తానే పోలీసుల్ని కలిసి కుట్రపై విచారణ చేయాలని కోరుతానని మెరుగు నాగార్జున అంటున్నారు. కానీ ఆ మహిళ మాత్రం మెరుగు నాగార్జునకు డబ్బులు ఇచ్చిన ఆధారాలు… ఆయన పీఏ ద్వారా తనతో చేయించిన సంభాషణలు.. ఇతర ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదులు చేయించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత ఏం చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.