అవకాశాల ఆశ చూపి… యువతుల్ని ప్రలోభపెట్టి..లైంగిక వేధింపులకు పాల్పడే.. ప్రబుద్ధులు సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. మీడియాలోనూ ఉన్నారని అప్పుడప్పుడూ బయట పడుతూ ఉంటుంది. తాజాగా.. టీవీ9 గ్రూప్‌లో..ఈ లైంగింక వేధింపుల వ్యవహారం కలకలం రేపుతోంది. టీవీ9 గ్రూప్‌లో హిందీ చానల్ అయిన భారత్వర్ష్లో పని చేస్తున్న ఇద్దరు ట్రైనీ మహిళా జర్నలిస్టులు.. తమను లైంగికంగా వేధిస్తున్న .. అవుట్పుట్ఎడిటర్ అజయ్ ఆజాద్ గురించి.. సంచలన ఆరోపణలు చేశారు. ఆయన తమను అర్థరాత్రి, అపరాత్రి తేడా లేకుండా.. ఫోన్లు చేస్తున్నారని.. బయట కలుద్దామని.. ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. గత నెల రోజుల నుంచి టీవీ9 గ్రూప్లోఈ లైంగిక వేధింపుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఆ ట్రైనీ మహిళా జర్నలిస్టులు.. తమ సంస్థ పెద్దలకు వరుసగా ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. కానీ.. వారికి కనీసం భరోసా కూడా లభించలేదు.
కొత్తగా జర్నలిస్టుల్ని నియమించుకుంటే.. వారిని ట్రైనీలుగా అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తుంది టీవీ9 గ్రూప్. ట్రైనింగ్ సమయంలో.. వారి పనితీరు ఆధారంగానే.. తర్వాత ఉద్యోగభద్రత ఉంటుంది. ఇలా నియమితులైన మహిళా జర్నలిస్టులు ఇద్దరు నోయిడాలోని టీవీ9 భారత్ వర్ష్ కార్యాలయంలో విధుల్లో చేరారు. అక్కడ యాంకరింగ్ అవకాశాలు ఇప్పిస్తానని.. మరో రకంగా… మీడియాలో మంచి అవకాశాలు ఇప్పిస్తానని చెబుతూ.. అవుట్ పుడ్ హెడ్ అజయ్ ఆజాద్.. ఇతర విధాలుగా.. చొరవ తీసుకోవడం ప్రారంభించారని.. ట్రైనీ జర్నలిస్టులు ఆరోపిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ తాకడం, బయట కలుద్దామని ఒత్తిడి చేయడం.. అర్థరాత్రిళ్లు కూడా వాట్సాప్‌లో అసభ్యకర సందేశాలు పంపడం.. నేరుగా ఇంటికే వచ్చేయడం వంటి చేష్టలకు పాల్పడుతున్నరాని ఆరోపిస్తున్నారు.
ఉద్యోగ భయంతో కొన్నాళ్లు ఎలాగోలా భరించిన ఆ ట్రైనీ జర్నలిస్టులు.. వేధింపులు భరించలేని స్థాయికి చేరడంతో.. యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. మొదట ఓ సారి ఫిర్యాదు చేస్తే స్పందన లేదు. తర్వాత మళ్లీ ఫిర్యాదు చేసినా స్పందన లేదు. ఫిర్యాదు చేసిన విషయం తెలిసి.. అజయ్ ఆజాద్.. వారిపై.. వేధింపులను మరింతగా పెంచాడని వారు ఆరోపిస్తున్నారు. సంస్థ పరువు, ప్రతిష్టల కోసం.. వారు.. తాము ఫిర్యాదు చేసిన విషయాలను బయట పెట్టలేదు. కానీ.. గతంలో భారత్వర్ష్లో పని చేసిన కొంత మంది జర్నలిస్టులకు..ఈ విషయంపై సమాచారం అందడంతో.. సోషల్ మీడియాలో హైలెట్ చేశారు. దీంతో వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.
మీటూ ఉద్యమం పేరుతో.. ఎవరిపైనైనా చిన్న ఆరోపణ వస్తే… చిలువలు పలువలు చేసి ప్రసారం చేసే టీవీ9.. ఇప్పుడు.. తమ ఉన్నత ఉద్యోగులపై ఆరోపణలు వస్తే మాత్రం.. సైలెంట్‌గా ఉంటోంది. కనీసం విచారణ జరిపించడానికి కూడా సిద్ధపడటం లేదు. ఆ బాధితులకు కనీసం భరోసా ఇవ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
I am told there are atleast 3-4 female trainees who had been sexually harassed by SENIORS/EDITORS of recently launched HINDI NEWS CHANNEL & these PREDATORS are asking for Sexual favours. Come on BRAVE GIRLS !! You need to speak up for yourselves. #MeToo https://t.co/4tDxeRTRZ0
— Vinod Kapri (@vinodkapri) January 23, 2020
STATEMENT: Two journalists at TV9 Bharatvarsh (Hindi news channel based in Noida, Delhi) filed separate sexual harassment complaints against a senior editor. As per the Sexual harassment of Women at Workplace (Prevention, Prohibition & Redressal) Act 2013, the matter was instantly referred to the ICC. After hearing the complainants and witnesses, the ICC served notice on the respondent. Immediately after the ICC indicated the initiation of a full inquiry, the management sent the respondent on leave for the duration of the inquiry. The respondent has since resigned. His resignation has been accepted with immediate effect.
TV9 Network has zero tolerance for sexual harassment or any discrimination at workplace and is committed to providing female employees a safe, sensitive and equal workplace.