కాంగ్రెస్ నాయకుల రాజకీయాలు అంతే. సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడదామంటే మొహం చాటేస్తారు. కెసీఆర్‌కి సాటి వచ్చే లీడర్ కాంగ్రెస్‌లో ఎవరు ఉన్నారంటే సోనియా గాంధీ దగ్గర కూడా సమాధానం ఉండదేమో. 2009 ఎన్నికల సమయంలో యువరాజ్యం అధినేతగా పవన్ కళ్యాణ్ మాటలు ఒకసారి వింటే కాంగ్రెస్ నేతల స్థాయి ఏంటో ఎవరికైనా ఇట్టే అర్థమయిపోతుంది. పవన్ పలికిన నిప్పులాంటి నిజాలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోయిన నేతల్లో షబ్బీర్ అలీ కూడా ఒకరు. 2014లో కెసీఆర్ గెలిచిన తర్వాత నుంచి ఈ కాంగ్రెస్ నేత పేరు ఎక్కడా వినిపించలేదు. ప్రజా సమస్యల పైన స్పందించిన దాఖలాలే లేవు. కానీ ఈయనగారికి ఇన్నాళ్ళకు ఒక అద్భుతమైన టాపిక్ దొరికినట్టుగా కనిపిస్తోంది. మామూలుగా అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో షబ్బీర్ అలీ ఏం మాట్లాడినా మీడియాలో పెద్దగా ప్రాముఖ్యత దొరికే అవకాశమే లేదు. ఆ విషయం షబ్బీర్ అలీకి కూడా తెలుసు. అందుకే మొత్తం తెలంగాణాలో వేరే ఏ సమస్యా లేనట్టుగా చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా సమంతా నియామకం గురించి మాట్లాడుతూ పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్నాడు.
ఒక నటిగా తను కష్టపడి సంపాదించిన సొమ్ములోంచి కొంత భాగాన్ని సమాజ సేవ కోసం వినియోగిస్తున్న విషయం షబ్బీర్ అలీకి తెలుసో తెలియదో మరి. అలాగే ప్రత్యూష ఫౌండేషన్ పేరుతో ఎన్నో ఛారిటీ యాక్టివిటీస్ చేస్తోంది సమంతా. ఈ రోజు కూడా ‘చీర కట్టుకోవడం సమంతాకే తెలుసా?’ అంటూ షబ్బీర్ అలీ మరోసారి రెచ్చిపోయాడు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేశాడు. చీర కట్టుకోవడం తెలుసు కాబట్టి కాదు…..చేనేతను ప్రమోట్ చేసే స్థాయి పాపులారిటీ సమంతాకు ఉంది కాబట్టే ఆమెను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారన్న విషయం షబ్బీర్ అలీకి తెలుసో తెలియదో మరి. అయినా మహిళలను గౌరవించడం మా బ్లడ్‌లోనే ఉంది అని చెప్పుకునే రాజకీయ నాయకులకు ఆ మహిళలను ఎలా గౌరవిస్తూ మాట్లాడాలో తెలియకపోతే ఎలా? సమంతా హెల్పింగ్ నేచర్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా చేనేతకు బ్రాండ్ వ్యాల్యూ తీసుకురావాలన్న ఆసక్తి సమంతాకు కూడా ఉందనే భావిస్తారు. అంతేకానీ డబ్బు కోసమో, లేకపోతే కాంగ్రెస్ నాయకుల్లాగా పబ్లిసిటీ కోసమో అయితే చేనేతకు బ్రాండింగ్ చేయాల్సిన అవసరం సమంతాకు లేదు. సమంతా బ్రాండ్ వ్యాల్యూ స్థాయి అది. రాజకీయ నాయకులు ప్రజా సమస్యలపైన స్పందిస్తే గౌరవంగా ఉంటుంది కానీ పబ్లిసిటీ కోసం స్పందిస్తే ఉన్న గౌరవం కూడా పోతుంది.