హైదరాబాద్: తెలంగాణ మంత్రి శ్రీనివాస యాదవ్ తన చిట్టాను బయటపెడతానంటూ నిన్న చేసిన హెచ్చరికకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ స్పందించారు. దమ్ము, ధైర్యం ఉంటే తన చరిత్రను బయటపెట్టాలని సవాల్ విసిరారు. తలసాని సంగతి ప్రజలకు బాగా తెలుసని, అతనొక దొంగమంత్రి అని అన్నారు. రాజీనామా గురించి చెప్పమంటే బ్లాక్ మెయిల్ మాటలు మాట్లాడుతూ అసలు విషయాన్ని పక్కకు మళ్ళిస్తున్నారని ఆరోపించారు. భయపెడితే భయపడేవాళ్ళం కాదని అన్నారు. ధనికరాష్ట్రమని కేసీఆర్ ఊదర కొట్టటంవలన కేంద్రంనుంచి నిధులు రావటంలేదని చెప్పారు. పాలనానుభవం లేకపోవటంతో ధనిక రాష్ట్రంకాస్తా దివాళా తీసిందని అన్నారు. పార్టీమారినవారిని కలిసేటందుకు సమయం ఉంటుందిగానీ సచివాలయాన్ని సందర్శించేందుకు కేసీఆర్కు సమయం దొరకటంలేదని షబ్బీర్ ఎద్దేవా చేశారు.