‘వైశాలి’ సినిమా హారర్ థ్రిల్లర్స్ లో ప్రత్యేకంగా నిలిచింది. నీరు ని హారర్ ఎలిమెంట్ గా తీసుకొని తీసిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మళ్ళీ అదే కాంబినేషన్ లో ఓ సినిమా వస్తుంది. ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్లు మరోసారి కలిసి చేస్తున్న ‘శబ్దం’.
ఈ సినిమా ట్రైలర్ బయటటికి వచ్చింది. ‘వైశాలి’లో నీరుని హారర్ ఎలిమెంట్ గా చూపితే ఇందులో ‘శబ్దం’ భయాన్ని పుట్టిస్తుంది. ఆడియో హాలోజినేషన్ కాన్సెప్ట్ తో అల్లుకున్న కథ ఇది. ‘వెయ్యి గబ్బిలాలు చెవిలో అరుస్తున్నట్లు వుంటుంది డాక్టర్’ అనే వాయిస్ తో ట్రైలర్ మొదలైయింది.
ఆది పారానార్మల్ ఇన్వెస్టి గేటర్ పాత్రలో కనిపించాడు. ఓ పెద్ద భవంతి చుట్టూ నడిచే క్రైమ్ హారర్ థ్రిల్లర్ ఇది. ఆత్మల రివెంజ్ ఇందులో కీ పాయింట్. సైన్స్- నమ్మకం మధ్య కాన్ ఫ్లిక్ట్ కూడా వుంది. సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్, రెడిన్ కింగ్స్లీ పాత్రలకూ ట్రైలర్ లో చోటు దక్కింది.
ట్రైలర్ లో కథని పెద్దగా రివిల్ చేయలేదు కానీ హారర్ ని ఇష్టపడే ఆడియన్స్ కి కావాల్సిన వరల్డ్ బిల్డింగ్ వుంది. తమన్ నేపధ్య సంగీతం హంటింగ్ గా వుంది. ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచగలిగింది. ఫిబ్రవరి 28న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది