ఇకపై గొడవల్లేవ్! నిర్మాతల మధ్య పేచీలు లేవ్! తెరవెనుక సెటిల్మెంట్ జరిగింది! ‘సవ్యసాచి’ వెనక్కి వెళ్లింది. దాంతో ‘శైలజారెడ్డి అల్లుడు’కి అడ్డకుంలన్నీ తొలగినట్టే. అక్కినేని నాగచైతన్య నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘శైలజారెడ్డి అల్లుడు’. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. దీనికంటే ముందు నాగచైతన్య మొదలుపెట్టిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘సవ్యసాచి’. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా చిత్రీకరణ పలు కారణాల వలన ఆలస్యమవుతూ వచ్చింది. ఎటువంటి అడ్డకుంలూ లేకుండా మారుతి సినిమా చకచకా పూర్తవడంతో రెండు సినిమాల విడుదల విషయంలో సమస్య తలెత్తింది.
ముందు మేమంటే ముందు మేమంటూ … రెండు సినిమాల నిర్మాతలు మంకుపట్టు పట్టారు. ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో ఒకానొక సమయంలో నాగచైతన్యకు తలనొప్పి తప్పలేదు. ‘‘నిజానికి, ముందు ‘సవ్యసాచి’ విడుదల కావాలి. అయితే… ఏ సినిమా విడుదల చేయాలన్నా, ముందు అవుట్‌పుట్ చూసి ఒక డెసిషన్ తీసుకుంటాను’’ అని చైతూ కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశాడు. ముందునుంచీ ‘సవ్యసాచి’ అవుట్‌పుట్ మీద అనుమానం వుంది. అందుకని అదే తర్వాత విడుదలవుతుందని, ఆగస్టు 31న ‘శైలజారెడ్డి అల్లుడు’ వస్తుందని వార్తలు వినిపించాయి. ఈ రోజు మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేసిన ప్రకటనతో సెప్టెంబర్ 15 తర్వాతే ‘సవ్యసాచి’ విడుదల అవుతుందనే స్పష్టత వచ్చేసింది. ‘‘ఆగస్టు 8తో టాకీ పార్ట్ పూర్తవుతుంది. ఆగస్టు 15న ఆఖరి పాటను ఫారిన్లో చిత్రీకరిస్తాం. సెప్టెంబర్ 15కి పోస్ట్ ప్రొడక్షన్‌తో పాటు సిజి వర్క్ కంప్లీట్ అవుతుంది’’ అని ‘సవ్యసాచి’ నిర్మాతలు పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. అంటే… ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాకి దారి ఇచ్చేసిన ‘సవ్యసాచి’ సెప్టెంబర్ సెకండాఫ్‌లోనే వస్తుందన్నమాట!