డైరెక్టర్లలో త్రివిక్రమ్‌కి ఒక ప్రత్యేక స్థానం వుంది. అతను కామెడీ ట్రాక్‌ని ఎంత బాగా తియ్యగలడో యాక్షన్ పార్ట్‌ని కూడా అంతే పవర్‌ఫుల్‌గా తియ్యగలడు. లవ్ సీన్స్‌ని ఎంత అందంగా చూపించగలడో, సెంటిమెంట్‌ని కూడా అంత బాగా పండించగలడు. ఇప్పటికే పవన్‌కళ్యాణ్, మహేష్, అల్లు అర్జున్ వంటి టాప్ హీరోలతో సూపర్‌హిట్ చిత్రాలను రూపొందించిన త్రివిక్రమ్ ప్రస్తుతం నితిన్‌తో ‘అఆ’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పెద్ద హీరోలంతా త్రివిక్రమ్‌తో సినిమా చెయ్యాలని ఎదురుచూస్తుంటే త్రివిక్రమ్ ఇలా నితిన్‌తో సినిమా చెయ్యడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటివరకు త్రివిక్రమ్ చేసిన సినిమాల కంటే ఫాస్ట్‌గా ఈ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇప్పటికి 50 రోజుల్లో 80 పర్సెంట్ సినిమా కంప్లీట్ అయిపోయింది.
వరసగా కొన్ని ఫ్లాపుల తర్వాత నితిన్‌కి ‘ఇష్క్’ వంటి సూపర్‌హిట్ సినిమా వచ్చింది. అప్పటికి ఆ సినిమా అనుకున్న దానికంటే ఎక్కువే కలెక్ట్ చేసింది. టోటల్‌గా 25 కోట్ల వరకు కలెక్ట్ చేసిన ఆ సినిమా నితిన్ కెరీర్లో టాప్ మూవీగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత రిలీజ్ అయిన ‘గుండె జారి గల్లంతయ్యిందే’ 20 కోట్లతో ఆగిపోయింది. ఆ తర్వాత వచ్చిన ‘హార్ట్ ఎటాక్’ 20 కోట్ల వరకు వెళ్ళలేకపోయింది. ఇక ‘చిన్నదాన నీకోసం’ 10 కోట్ల దగ్గరే ఆగిపోయింది. దీన్ని బట్టి నితిన్ సినిమా చాలా పెద్ద హిట్ అయితే 25 కోట్ల వరకు కలెక్ట్ చేస్తుందనేది అర్థమవుతుంది. కానీ, త్రివిక్రమ్ మాత్రం ‘అఆ’ చిత్రం కోసం నిర్మాతతో చాలా ఖర్చు పెట్టిస్తున్నాడట. టోటల్‌గా ఈ సినిమా బడ్జెట్ 35 కోట్లకు చేరుకోబోతోంది. పెద్ద హిట్ అయితేనే 25 కోట్ల వరకు వెళ్ళగలిగే నితిన్.. 35 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ‘అఆ’ చిత్రం నిర్మాతకు లాభాలను తెచ్చిపెట్టాలంటే కలెక్షన్స్ ఏ రేంజ్లో వుండాలి? ఈ నిర్మాతకు సేఫ్ ప్రాజెక్ట్ అయ్యే కలెక్షన్స్ సాధించే రేంజ్‌కి నితిన్ వెళ్ళగలడా?