మధ్యతరగతి ప్రజలు నలభై నుంచి యాభై లక్షల లోపు ఇళ్లు ఎక్కడ దొరుకుతాయా అని వెదుకుతూ ఉంటారు. అలాంటి వారికి మరో బెస్ట్ ఆప్షన్ షామీర్ పేట. షామీర్ పేట్ చుట్టుపక్కల ప్రాంతంలో భారీ నిర్మాణ ప్రాజెక్టులు ఉన్నాయి. అందరికి అందుబాటు ధరలో అపార్ట్ మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, విల్లాలు లభిస్తుండటంతో అంతా షామీర్ పేట్ వైపు చూస్తున్నారు. నగరంలో జీవనం ఆర్థిక భారంగా మారిన మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ఖర్చులో అన్ని వసతులు ఉన్న కేంద్రంగా షామీర్ పేట్ కీలకంగా మారింది.
ఇల్లు, ప్లాట్లు కొనేముందు ఎవరైనా మౌలిక వసతుల గురించి ఆలోచిస్తారు. రవాణా, రహదారులు, నీటి సౌకర్యం, సమీపంలో విద్యాసంస్థలు, వైద్య సదుపాయం వంటివి చూసి ఇంటి కొనుగోలుపై నిర్ణయం తీసుకుంటారు. షామీర్ పేటకు ఈ ప్లస్ పాయింట్లు అన్నీ ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో షామీర్ పేట్ ఉంది. షామీర్ పేట్ రాజీవ్ రహదారి, అవుటర్ రింగ్ రోడ్డుకు అత్యంత చేరువలో ఉంది. మేడ్చల్ జిల్లా కొత్త కలెక్టరేట్ సైతం షామీర్ పేట్ కు దగ్గర్లో ఉంది. శామీర్పేట సహా చుట్టుపక్కల ప్రాంతాలు మున్సిపాలిటీలుగా మారాయి.
అందుబాటులో ఉన్న ధరలతో శామీర్పేట వైపు ఇంటి కొనుగోళ్లు పెరుగుతున్నాయి. కండ్లకోయ ఐటీ పార్క్ నుంచి ఓఆర్ఆర్ బయట ఉండే శామీర్పేట, ఓఆర్ఆర్ లోపల ఉండే తూంకుంట ప్రాంతానికి మధ్య అనేక నివాస ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. పలు అపార్ట్ మెంట్ లో 945 చదరపు అడుగుల విస్తీర్ణంలో డబుల్ బెడ్రూం ఫ్లాట్ 45 లక్షల్లో లభిస్తున్నాయి. 1200 చదరపు అడుగుల విస్తీర్ణంలో డబుల్ బెడ్రూం ఫ్లాట్ 52 లక్షల్లో లభిస్తున్నాయి. డీటీసీపీ లేఅవుట్ లో ఇంటి స్థలం చదరపు గజం ప్రాంతాన్ని బట్టి 16 వేల రూపాయల నుంచి 40 వేల రూపాయల వరకు ఉంది.
ఇప్పటికే షామీర్ పేటకు మంచి కనెక్టివిటీని ఉంది. ఎంఎంటీఎస్ కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే డిమాండ్ ముందు ముందు మరింత పెరగనుంది.