కమల్ హాసన్, శంకర్ క్యాంబినేషన్ లో 22 ఏళ్ల క్రితం వచ్చిన మూవీ భారతీయుడు. అప్పట్లో సంచలన విజయం సాధించిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ను ప్లాన్ చేశాడు దర్శకుడు శంకర్. కమల్‌హాసన్‌నే ఈ సీక్వెల్లోనూ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించిన విషయాలను తైవాన్ లో శంకర్ వెల్లడించారు.
‘ఇండియన్ 2’ను త్వరలో స్టార్ట్ చేయబోతున్నట్లు ‘హీలియమ్ బెలూన్’ను ఆయన తైవాన్‌లో ఎగురవేశారు. ఆ బెలూన్‌పై ‘ఇండియన్ 2’ అని తమిళంలో, ఇంగ్లిష్‌లో వ్రాసి ఉంది. రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన ‘2.0’కి రచయితగా వ్యవహరించిన జయమోహన్ ‘భారతీయుడు 2’కి కూడా రైటర్‌గా వ్యవహరించనున్నాడు. వచ్చే నెల ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. మొదట్లో దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తాడని ప్రచారం జరిగింది, దిల్ రాజు కూడా కమల్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న తమిళ్ బిగ్ బాస్ షో లో పాల్గొన్నాడు. దిల్ రాజే నిర్మాత గా త్వరలో సినిమా ప్రారంభమవుతుందని అందరూ అనుకుంటూంటే, సడెన్ గా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు దిల్ రాజు. దీంతో ఈ ప్రాజెక్ట్ లైకా ప్రొడక్షన్స్ చేతికి వచ్చింది.మొదటి పార్ట్ కి రహమాన్ సంగీతం అందిస్తే, ఈ సారి అనిరుధ్ ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది కానీ ఇంకా అధికారికంగా ప్రకటింపబడలేదు.