రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. చిత్రీకరణ దాదాపు 50 శాతం పూర్తయ్యింది కూడా. కానీ ఇప్పటి వరకూ టైటిల్ బయటకు రాలేదు. సర్కారోడు, సిటిజన్ అంటూ రకరకాల పేర్లు అనుకొన్నారు. ఇప్పుడు మరో కొత్త టైటిల్ బయటకు వచ్చింది. ఈ సినిమాకి ‘సీఈవో’ అనే పేరు పెట్టారని చెప్పుకొంటున్నారు. సీఈవో అంటే… చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అనే అర్థం ఉంది. ఈ సినిమాలో… చరణ్ ఎలక్షన్ ఆఫీసర్గా కనిపించనున్నాడు. అయితే… అక్కడితో ఆగిపోవడం లేదు. ఆ తరవాత సీఎమ్ కూడా అవుతాడు. కొన్ని చోట్ల ముఖ్యమంత్రుల్ని ‘చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్’ అని కూడా పిలుస్తారు. అలా… రెండు అర్థాలు వచ్చేలా ఈ పేరు పెట్టారేమో అనిపిస్తోంది. అయితే.. ఇదేం ఖాయం కాదు. శంకర్ దగ్గర ఇలాంటి టైటిళ్లు చాలా ఉన్నాయి. అవన్నీ కేవలం పరిశీలనలో మాత్రమే ఉన్న టైటిళ్లు. అందులో ఏది ఖాయం చేస్తారో ఎవరికీ తెలీదు. ఈనెలలోనే చరణ్ పుట్టిన రోజు వస్తోంది. ఆ రోజున.. చరణ్ టైటిల్ని అధికారికంగా ప్రకటిస్తారు.