యేడాదికి రెండు సినిమాలు చేసినా సరే.. ‘దర్శకుడు చాలా స్లోరా..’ అనేస్తుంటాం. పూరిలాంటివాళ్లు ఈజీగా నాలుగేసి సినిమాలు తీసేస్తుంటారు. అలాంటి స్పీడే పరిశ్రమకు కావాలి. కానీ శంకర్లాంటివాళ్లు మాత్రం నాలుగేళ్లకు ఓ సినిమా తీస్తుంటారు. ‘2.ఓ’ చూడండి. నాలుగేళ్లుగా సెట్స్‌పైనే ఉంది. దానికి తగ్గట్టుగానే ఆ సినిమా బడ్జెట్ కూడా అంతకంతకూ పెరుగుతూ వెళ్లింది. తీరా చూస్తే.. ఆరొందల కోట్ల సినిమాగా మారిపోయింది. నాలుగేళ్ల పాటు ఈ సినిమా సెట్స్‌పైనే ఉండడానికీ, బడ్జెట్ ఈ స్థాయిలో పెరగడానికి కారణం.. శంకర్.
అవును. ఈ కథని మూడు సార్లు మార్చాడట శంకర్. దాని కోసం రీషూట్ల మీద రీషూట్లు చేసుకుంటూ వెళ్లాల్సివచ్చింది. రెహమాన్ కూడా ఈ సినిమా కోసం మూడు సార్లు రీ రికార్డింగ్ కూడా మార్చాల్సివచ్చింది. అంటే.. సీన్ పూర్తయి, ఎడిటింగ్ అయి, సీజీ కూడా అయ్యి, దానికి రీ రికార్డింగ్ చేసిన తరవాత ఆ స్థానంలో కొత్త సన్నివేశం వచ్చిందంటే.. శంకర్ ఎంత జాప్యం చేశాడో అర్థమవుతూనే ఉంది. నాలుగేళ్లుగా ఈ సినిమా కథ అటూ ఇటూ మారుతూ మారుతూ, రీషూట్లు చేసుకుంటూ వెళ్లారు. అందుకే ఈ స్థాయిలో ఖర్చయ్యింది. శంకర్ గత చిత్రం ‘ఐ’ దారుణంగా నిరాశ పరిచింది. `త్రీ ఈడియట్స్`ని తమిళంలో రీమేక్ చేశారు. అదైతే డిజాస్టర్. అందుకే `రోబో 2.ఓ` విషయంలో జాగ్రత్తపడిపోయాడు. ఈ సినిమా కథ విషయంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వెళ్లాడు. అందుకే… రీషూట్లు ఎక్కువయ్యాయని తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే రెహమాన్కూడా… ”కథలో మార్పుల వల్ల.. రీరికార్డింగ్ కూడా మార్చాల్సివచ్చింది. ముందు పాటలే వద్దనుకున్నాం. ఆ తరవాత పాటలు చేరాయి” అన్నారు.