సూర్య, కార్తీలు ఒకే సినిమాలో కలిసి నటిస్తే చూడాలని అభిమానుల కోరిక. ఈ బ్రదర్స్ కూడా అలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ బ్రదర్స్ కోసం శంకర్ ఓ కథ రెడీ చేసినట్టు సమాచారం. శంకర్ దర్శకత్వంలో నటించాలని సూర్య కూడా ఎప్పటి నుంచో అనుకొంటున్నాడు. ఒక సినిమాతో రెండు కోరికలూ తీరబోతున్నాయి.
ప్రస్తుతం శంకర్ గేమ్ ఛేంజర్, భారతీయుడు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. భారతీయుడు 2 తరవాత భారతీయుడు 3 కూడా రాబోతోందని తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ కూడా 2 భాగాలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ పూర్తయిన తరవాత శంకర్ చేయబోయే ప్రాజెక్ట్ ఇదే అని టాక్. ప్రస్తుతం శంకర్ దగ్గర ఉన్న రైటింగ్ టీమ్ ఈ స్క్రిప్టుపై తర్జన భర్జనలు పడుతోందని తెలుస్తోంది. త్వరలోనే ఈ కాంబోపై ఓ స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.