ఎన్ని అవాంతరాలు వచ్చినా రామ్ చరణ్ తో ప్రాజెక్టు ని వీలైనంత ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నాడు శంకర్. రామ్ చరణ్‌తో శంకర్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే.. `భారతీయుడు 2` నిర్మాతలతో తగువు కారణంగా చరణ్‌తో సినిమా ఉంటుందా, ఉండదా? ఉంటే ఆలస్యం అవుతుందా.. సకాలంలో తెరకెక్కుతుందా? అనే డౌట్లు చాలా ఉన్నాయి. కానీ శంకర్ మాత్రం ఇవేం పట్టించుకోవడం లేదు. స్క్రిప్టు విషయంలో తలమునకలై ఉన్నాడు.
ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని ఇన్సైడ్ వర్గాల టాక్. తండ్రీ కొడుకులుగా చరణ్ నటించబోతున్నాడని తెలుస్తోంది. అయితే ఓ పాత్ర.. యాభై ఏళ్లకు పైబడిన వయసు. నిజానికి ఈ స్క్రిప్టు రాస్తున్నప్పుడు శంకర్ ఆలోచనలు వేరు. ఆ పాత్రకు మరో హీరోని తీసుకోవాలని అనుకున్నాడు. కానీ.. చరణ్ మాత్రం పట్టుబట్టి, ఆ పాత్ర కూడా తానే చేస్తానని చెప్పాడట. అలా అది డ్యూయెల్ రోల్ అయిపోయిందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు శంకర్ చరణ్ ముందు రెండు ఆప్షన్లు పెట్టాడట. అందులో భాగంగా చరణ్ కి మేకప్ టెస్ట్ చేయిస్తారు. 50 ఏళ్ల లుక్ ట్రై చేస్తారు. ఆ లుక్ కుదిరితే.. చరణ్ నే ఆ పాత్ర చేసేస్తాడు. అటూ ఇటుగా ఉన్న పక్షంలో.. ఆ పాత్రలోకి మరో హీరోని తీసుకొస్తారు. ఈ రెండు నిర్ణయాలూ చరణ్‌కే వదిలేశాడు శంకర్. టెక్నికల్ గా శంకర్ సినిమాలు భారీ స్థాయిలో ఉంటాయి. ప్రపంచ సాంతికేతికని ఆయన విరివిగా వాడేస్తుంటారు. భారతీయుడులోనే కమల్ హాసన్ ని వృద్ధుడిగా చూపించి వారెవా అనిపించారు. కాబట్టి..ఈ సారీ అలాంటి మేకప్ ట్రిక్కుల్ని ఊహించొచ్చు. చరణ్ ధైర్యం కూడా అదే కావొచ్చు. అందుకే… డ్యూయెల్ రోల్ చేయడానికి ఒప్పుకుని ఉండొచ్చు. అయితే లుక్ సూటవుతుందా, లేదా? అనేది తెలియాలంటే మేకప్ టెస్ట్ అయ్యేంత వరకూ ఆగాల్సిందే.