పవన్ ఇప్పుడు పూర్తిగా రాజకీయ వాసి అయిపోయాడు. సినిమాల్ని తాత్కాలికంగా పక్కన పెట్టినట్టే. అయితే… ఆయన మరీ సినిమాలకు దూరం అయినట్టు అనుకోకూడదు. నిర్మాతగా తన నుంచి ఓ సినిమా వస్తోంది. నితిన్ కథానాయకుడిగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. దీనికి పవన్, త్రివిక్రమ్‌లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే… ఈ సినిమాకి డబ్బులు పెట్టిందంతా శ్రేష్ట్ మీడియా అని, నితిన్ కేవలం పవన్, త్రివిక్రమ్‌ల పేర్లు వాడుకుంటున్నాడని, పేర్లు వాడినందుకే లాభాల్లో వాటా ఇవ్వబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే అత్యంత సన్నిహితులు అందించిన సమాచారం ఏమిటంటే… ఈ సినిమా ప్రారంభించిన రోజే పవన్ రూ.2 కోట్లు ఏక మొత్తంగా ఇచ్చాడట. బహుశా.. పవన్ పెట్టుబడి అదే కావొచ్చు. నితిన్ – కృష్ణ చైతన్య సినిమాకి రూ.15 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టే ఛాన్స్ ఉంది. అందులో పవన్ వాటా.. ప్రస్తుతానికి రూ.2 కోట్లు అనుకోవాలి. మరి త్రివిక్రమ్ ఎంత ఇచ్చాడన్నది లెక్క తేలాలి. కేవలం పవన్, త్రివిక్రమ్ ల పేర్లే కాదు, వాళ్ల డబ్బులూ ఈ సినిమాలో ఉన్నాయి. ఆ విషయాన్ని గమనిస్తే మంచిదని పవన్ సన్నిహితులు చెబుతున్నారు.