ఓ టాలీవుడ్ హీరోతో తనకు సంబంధం ఉందని బాలకృష్ణ ప్రచారం చేయించాడని షర్మిల ఆరోపించిందని జగన్ మూడు రోజుల కిందట ప్రెస్మీట్లో ఆరోపించారు. ఓ వీడియో క్లిప్ కూడా ప్రదర్శించారు. ఇప్పుడు షర్మిల లైవ్లో అసలు ఆ పని చేయించింది జగన్ రెడ్డేనని ప్రకటించార. హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించిన షర్మిల.. తన సైతాన్ సైన్యంతో జగనే తనకు ఓ హీరోతో సంబంధం ఉందని ప్రచారం చేయించారన్నారు. తనకు ఎలాంటి రిలేషన్ లేదని తన పిల్లలపై అప్పుడూ ఒట్టేశానని ఇప్పుడూ ఒట్టేస్తున్నానని భావోద్వేగానికి గురయ్యారు.
2019 ఎన్నికలకు ముందు తెలంగాణ పోలీసుల సాయంతో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల్ని టార్గెట్ చేయడానికి వైసీపీ కార్యకర్తలే ఫేక్ ఖాతాలతో ఓ హీరోతో షర్మిలకు రిలేషన్ అంటగట్టారు అదే పనిగా ప్రచారం చేశారు. వాటిని ఎవరైనా టీడీపీ కార్యకర్తలు షేర్ చేయడమో.. కామెంట్ చేయడమో చేస్తే.. అదే అదనుగా షర్మిలతో హైదరాబాద్లో ఫిర్యాదులు ఇప్పించి పెద్ద ఎత్తున అరెస్టులు చేశారు. ఆ సందర్భంలో ఎన్బీకే బిల్డింగ్ నుంచి పోలీసులు పెట్టారని ఆరోపించారు. అప్పటి క్లిప్ తీసుకు వచ్చి జగన్ రాజకీయం చేయాలనుకున్నారు కానీ షర్మిల తిప్పికొట్టారు. ఇప్పుడు చెల్లిపై గతంలోనూ తప్పుడు ప్రచారం చేయించిటన్లుగా ఆమె ఆరోపించినట్లయింది.
అదానీ వ్యవహారంపైనా స్పందించారు. జగన్ రెడ్డి లంచాలు తీసుకున్నారని.. లంచాలు ఇస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారా అని ప్రశ్నించారు. జగన్, అదానీ దేశం పరువు తీశారని అన్నారు. ఆధారాలు ఉండబట్టే అమెరికా ఏజెనన్సీలు కేసులు పెట్టాయని గౌతమ్ అదానీని విచారిస్తే మొత్తం విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఇద్దరీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.