ఎమ్మెల్యేలుగా ప్రజలు గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్లబోమంటున్న జగన్కు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మంచి సలహా ఇచ్చారు. అంత ధైర్యం లేకపోతే అందరూ రాజీనామా చేయాలన్నారు. ఎవరైనా అసెంబ్లీకి వెళ్లి తేల్చుకుంటామంటారు కానీ జగన్ రెడ్డి మాత్రం భిన్నం. మైక్ ఇవ్వరని ఆయనకు ఆయనే అనుకుని తాను మీడియా ముందు మాత్రమే మాట్లాడతానని అంటున్నారు. ఈ ప్రకటనపై షర్మిల రాజీనామా చేయాలని సలహా ఇచ్చారు.
వైసీపీకి పది శాతం అసెంబ్లీ సీట్లు రాకపోవడంతో ప్రధాన ప్రతిపక్ష నేత హోదా సాంకేతికరంగా రాలేదు. అయితే స్పీకర్ విచక్షణాధికారం ప్రకారం ఇవ్వొచ్చు. కానీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు నిర్ణయం తీసుకోక ముందే వైఎస్ జగన్ తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం లేదని హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. దానిపై విచారణ వాయిదా పడింది. మాములుగా అయితే ఆయన వైసీపీ పక్ష నేత జగనేనని ఆయనతి ప్రతిపక్ష పార్టీనే కాబట్టి ప్రతిపక్ష నేతేనని కాదని ఎవరూ అనడం లేదని స్పీకర్ అంటున్నారు.
మాట్లాడేందుకు సమయం వస్తుందని జగన్ అసెంబ్లీకి రావాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా ఆహ్వానిస్తున్నారు. కానీ గత అసెంబ్లీలో జరిగిన పరిణామాలను బట్టి అసెంబ్లీకి హాజరైతే తమనూ అవమానిస్తారని జగన్ భ యపడుతున్నారు. అందుకే అసెంబ్లీకి రానంటున్నారు. నిబంధనల ప్రకారం వరుసగా మూడు సెషన్లకు హాజరు కాకపోతే అనర్హతా వేటు వేసే అధికారం స్పీకర్ కు ఉంటుంది. మరి స్పీకర్ ఏం చేస్తారో ?