కడప పార్లమెంటు , పులివెందుల అసెంబ్లీ నుంచి సునీత, ,షర్మిలలు పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇడుపులపాయలో ఈ అంశంపై ఇద్దరూ చర్చలు జరిపారు. పోటీ చేస్తే మొత్తం తానే చూసుకుంటానని షర్మిల సునీతకు భరోసా ఇచ్చారు. దీంతో ఆమె కానీ.. ఆమె తల్లి కానీ కడప పార్లమెంట్ నుంచి పోటీ చేయడానికి అంగీకారం తెలిపారని అంటున్నారు . పీసీసీ చీఫ్ గా షర్మిల పులివెందుల అసెంబ్లీ నుంచి బరిలోకి దిగనున్నారు.
సునీత కాంగ్రెస్ నుంచి కడప లోక్‌సభ బరిలో నిలిస్తే కడప ఎంపీగా ఉన్న అవినాష్‌రెడ్డి పై పోటీ పడాల్సి ఉంటుంది. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డినే సునీత ప్రధాన నిందితునిగా కోర్టులో సునీత వాదిస్తున్నారు. తన తండ్రిని చంపిన వారిని ఓటు ద్వారా శిక్షించాలని తనకు న్యాయం చేయాలని సునీత ప్రచారం చేస్తే ఇంపాక్ట్ ఎంత ఉంటుందో ఊహించడం కష్టం. ఎందుకంటే రాజకీయాల్లో సానుభూతిని మించిన పెద్ద అస్త్రం లేదు. ఇప్పటికే తల్లి, చెల్లిని జగన్ పట్టించుకోవడం లేదని విపక్షాలు చేస్తున్న విమర్శలతో.. జనం కూడా దాని గురించి మాట్లాడుకుంటున్నారు .. దానికి తోడు వివేకా హత్యతో జిల్లా వ్యాప్తంగా వైఎస్ సునీతపై సానుభూతి కనిపిస్తోంది.
వైఎస్ అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ అనుకునే చాలా మంది నేతలు జిల్లాలో .. వారంతా ఇప్పటివరకు గత్యంతరం లేక వైసీపీ వెంట నడుస్తున్నారుని అంటున్నారు. . ఇప్పుడు షర్మిల అన్నకు వ్యతిరేకంగా .. అందులోనూ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా మారడంతో .. వారంతా ఆమె వెంట నడిచే అవకాశాన్ని కొట్టిపారేయలేంమని అంచనా వేస్తున్నారు. జగన్ రెడ్డి ఎన్నికల్లో పోటీ నుంచి వేరే చోటికి పారిపోతే.. కడప బరిలో ఈ సారి సంచలన రాజకీయం జరిగే అవకాశాలు ఉన్నాయి.