జగన్ రెడ్డిని జగన్ రెడ్డి అని పిలవడంపై వైసీపీ నేతలు విమర్శలు చేయడంపై షర్మిల భిన్నంగా స్పందించారు. జగన్ అన్న గారూ అంటే ఓకేనా అని ప్రశ్నించారు. ఇక నుంచి అలాగే పిలుస్తానని సెటైర్ వేయడమే కాదు.. తర్వాత తన ప్రసంగాల్లో అదే కంటిన్యూ చేస్తున్నారు. ఇచ్చాపురం నుంచి యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా తనపై విమర్శలు చేసిన వైవీ సుబ్బారెడ్డికి కౌంటర్ ఇచ్చారు. అభివృద్ధి చూపిస్తామన్నారని.. చూపించాలని సవాల్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ నుంచే YSR అన్ని పథకాలు అమలు చేశారని.. YSR కి కాంగ్రెస్ ఎంతబలలమో…కాంగ్రెస్ కి YSR అంతే బలమన్నారు. YSR అంటే కాంగ్రెస్ కి ఇప్పటికీ అభిమానం ఉందని.. రాజీవ్ చనిపోయాక కూడా FIR లో పేరు పెట్టారని గుర్తు చేశారు. తెలియక చేసిన తప్పు కానీ…తెలిసి చేసింది కాదు .. YSR బ్రతికి ఉన్నంత కాలం బీజేపీ కి వ్యతిరేకిగా ఉన్నారన్నారు. ఇవాళ ఏపీలో అధికారంలో ఉన్న బీజేపీ నేనని.. బీజేపీ నే పాలన చేస్తోందన్నారు. బీజేపీ కి ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు…కానీ ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది . జగన్ ఆన్న గారు ప్రభుత్వం బీజేపీ కి కీలుబొమ్మ లా మారింది. బీజేపీ కి ఊడిగం చేస్తున్నారని మండిపడ్డారు.
.
ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బీజేపీ కి ఓటు వేయలేదు ..కానీ పార్టీలు మాత్రం బీజేపీ పంచన చేరాయన్నారు. జగన్ ఆన్న గారు ప్రత్యేక హోదా గురించి ఒక్క రోజు అడగలేదు.. 25 మంది ఎంపీలు ఇస్తే హోదా తెస్తా ఆన్న మీ మాటలు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ మొదటి సంతకం ప్రత్యేక హోదా మీదే పెడతా అన్నారని.. అందరం కలిసి వైఎస్ఆర్ ఆశయాలను బతికిద్దామని పిలుపునిచ్చారు.
షర్మిల వైసీపీ మీదనే ప్రధానంగా ఎగ్రెసివ్ గా ఉండటం.. ఆ పార్టీ నేతల్ని ఇబ్బంది పెడుతోంది. ఎలా స్పందిస్తే ఎలా రివర్స్ అవుతుందోనని కంగారు పడుతున్నారు.