సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ.. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల హైదారాబాద్ పోలీసుల్ని ఆశ్రయించారు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఎనిమిది మందిపై ఫిర్యాదు చేశారు. తప్పుడు రాతలతో తనను మానసికంగా వేధిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఎనిమిది మందిలో శ్రీరెడ్డి, వర్రా రవీంద్రారెడ్డి కూడా ఉన్నారు. మేదరమెట్ల కిరణ్ కుమార్, రమేష్ బులుగాకుల, పంచ్ ప్రభాకర్ రెడ్డి , ఆదిత్య, సత్యకుమార్ దాసరి, సేనాని , మహ్మద్ పాషా అనే వ్యక్తులపై ఈ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ఎనిమది మందికి నోటీసులు జారీ చేయడమో.. అరెస్టు చేయడమో చేస్తారని భావిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది వైసీపీ సోషల్ మీడియా పేరోల్స్ లో ఉన్న వారేనని తెలుస్తోంది. తమకు డబ్బులు సరిగ్గా ఇవ్వడం లేదని శ్రీరెడ్డి ఓ సారి వీడియో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక వర్రా రవీంద్రారెడ్డి సంగతి చెప్పాల్సిన పని లేదు. మిగిలిన వారు వైసీపీ పే రోల్స్ లో ఉన్న వారేనని భావిస్తున్నారు. వీరిని పట్టుకుని వస్తే.. షర్మిలపై ఎవరు టార్గెటెడ్‌గా దుష్ప్రచారం చేస్తున్నారో స్పష్టమవుతుంది.
ఏపీ పీసీసీ చీఫ్ గా ఉన్న షర్మిల హైదరాబాద్ సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేశారు. ఏపీలో పోలీసులు వ్యవహరించే తీరుపై ఆమెకు క్లారిటీ ఉంది. ఆమె సోదరి సునీత కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు కూడా పెట్టారు. వర్రా రవీంద్రారెడ్డి పేరును ఆమె కూడా ఇచ్చారు. హైదరాబాద్ పోలీసులు ఏమి చర్యలు తీసుకుంటారన్నదానిపై తదుపరి పరిణామాలు ఉండే అవకాశం ఉంది.