అదానీ విద్యుత్ ను సెల్ ద్వారా ఏపీ కొనాలని నిర్ణయించుకున్న డీల్ ను రద్దు చేయాలని వైసీపీ సవాల్ చేస్తోంది. దుమ్ముంటే రద్దు చేయమని అంటోంది. అదే సమయంలో కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల కూడా అదే అంటున్నారు. డీల్స్ ను రద్దు చేయాలనే అంటున్నారు . వైసీపీ నేతలు మరీ గీత దాటిపోయారు. దొరికిన దొంగ చేసే రచ్చ మాదిరిగా వ్యవహారం ఉంది. అది తాము ఒక్కరిది కాదని తలాపాపం తిలాపిడికెడు అని అందరూ దొరికిపోతారని అందుకే బయటకు రాదన్న ధీమాతో ఉంది. సవాల్ చేయిస్తోంది.
షర్మిల విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని చేస్తున్న డిమాండ్ వెనుక వైసీపీ కోణం కాదు కానీ నిజంగానే రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. అలా రద్దు చేస్తే అదానీకి భారీగా నష్టం జరుగుతుంది. అమెరికా నుంచి పెట్టుబడుల రూపంలో సేకరించిన డబ్బును ఇక్కడ లంచాలుగా ఇచ్చారు. అసలు ప్రాజెక్టుపోవడమే కాకుండా..లంచాలతో పాటు.. కంపెనీ పరువు ప్రతిష్టలు కూడా మంట గలిసి పోతాయి.
రాష్ట్ర ఇమేజ్‌పై జగన్ రెడ్డి చేసిన ఘోరమైన దాడి ఈ అవినీతి వ్యవహారం అనుకోవచ్చు. అమెరికా నుంచి వచ్చే ఆధారాలను బట్టి చంద్రబాబు తదుపరి నిర్ణయం తీసుకుంటారు. విషయం బయటపడింది ఇప్పుడే కాబట్టి.. ఖచ్చితంగా తర్వాత డెవలప్మెంట్స్ ను బట్టి విచారణ ఉంటుంది. అడ్డంగా దొరికిన జగన్ రెడ్డిని చంద్రబాబు వదిలే అవకాశం లేదని టీడీపీ నేతలు నమ్ముతున్నమాట .