షర్మిల చేస్తున్న డైరక్ట్ ఎటాక్ తో వైసీపీ ఉక్కిరి బిక్కిరవుతోంది. తాజాగా ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి పోనని.,. తన ఎమ్మెల్యేలు కూడా పోరని జగన్ ప్రకటించడంతో షర్మిల రంగంలోకి దిగిపోయారు. అంత మాత్రం దానికి ఇక ఎమ్మెల్యే పదవులు ఎందుకు రాజీనామా చేయాలని సవాల్ చేశారు. జగన్ రెడ్డికి ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ మీడియా అసెంబ్లీగా మారిందని… ప్రజల్ని ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడం.. దివాళాకోరుతనమని మండిపడ్డారు.
అజ్ఞాని, పిరికి, చేతకానితనం, అహంకారం ఇలా అన్ని పదాలనూ ఉపయోగిచంి జనగ్ పై విరుచుకుపడుతున్నారు. ప్రజలను ఇలా వెర్రిగా, వింతగా మోసం చేయడంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభల్లో ప్రజల గొంతుక అవ్వడానికా, లేక మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికా అని సూటిగా ప్రశ్నించారు. అసెంబ్లీలో అధికారపక్షం శ్వేతత్రాలు విడుదల చేస్తూంటే.. ప్యాలెస్లో మీడియా మీట్లు పెట్టడానికి సిగ్గుండాలన్నారు. అసెంబ్లీకి పోనని చెప్పే మీరు, ప్రతిపక్ష హోదాకే కాదు, ఎమ్మెల్యే హోదాకు కూడా అర్హులు కారు. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
బడికి పోను అనే పిల్లోడికి టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తారు, ఆఫీసుకు పోననే పనిదొంగను వెంటనే పనిలోంచి పీకేస్తారని గుర్తు చే శారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోనప్పుడు మీరు ఆఫ్రికా అడవులకు పోతారో, అంటార్టికా మంచులోకే పోతారో ఎవడికి కావాలి అప్పుడు. అసెంబ్లీకి పోని జగన్ అండ్ కో తక్షణం మీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలి అని సవాల్ చేశారు. షర్మిల సూటిగా సుత్తిలేకుండా వేసిన ప్రశ్నలు, చేసిన డిమాండ్లు చర్చనీయాంశంగా మారాయి. వైసీపీకి ఎలా స్పందించాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.