అసెంబ్లీకి వెళ్లకపోతే రాజీనామా చేయాలని వైసీపీ సభ్యులను ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు అసెంబ్లీకి వెళ్లి ప్రజాసమస్యలపై చర్చించాలని ఓట్లు వేస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో తమ విధుల్ని నిర్లక్ష్యం చేయడం క్షమించరానిదని ఆమె అంటున్నారు. అందుకే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు . ఈ అంశంలో షర్మిలకు మద్దతు పెరుగుతోంది. ప్రెస్మీట్లలో మాట్లాడేదానికి ఎమ్మెల్యే పదవులు ఎందుకని ఆ పదవులు లేకపోయినా మాట్లాడవచ్చని సొంత మీడియాలో ప్రచార చేసుకోవచ్చని అంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి విచిత్రమైన మనస్థత్వం కారణంగా వైసీపీ ప్రజల్లోఇంకా చులకన అవుతోంది. ఆయన మాత్రమే కాదు ఎమ్మెల్యేలతోనూ అసెంబ్లీ బాయ్ కాట్ చేయిస్తున్నాయి. ఎమ్మెల్యే ప్రధాన విధి.. నియోజకవర్గంలో దందాలు చేయడం కాదు.. అసెంబ్లీలో మాట్లాడటం..చట్టాలు చేసే ప్రాసెస్‌లో పాలు పంచుకోవడం. దాన్ని కాదంటే..ఇక ప్రజల ఓట్లకు విలువ లేనట్లే. అనర్హతా వేటు వేస్తే రాజకీయం చేస్తారు కానీ.. వారే రాజకీయం చేస్తే మాత్రం సమస్య ఉండదు.
వైసీపీ ఎమ్మెల్యేలు కాకపోతే వారి స్థానంలోఇతరులు ఉంటే ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్లి తమ వాదన వినిపిస్తారు. అందుకే వారు రాజీనామా చేసి ఇతరులకు అవకాశం ఇవ్వాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. తనకు అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఇస్తే వదులుకోనని షర్మిల అంటున్నారు. వైసీపీ ఈ విషయంలో కాస్త ఆలోచిస్తే బెటరమో?.