షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం ఖాయమయింది. ఆందు కోసం ఆ పదవి ని ముందుగానే ప్రస్తుత చీఫ్ గిడుగు రుద్రరాజు రాజీనామా సమర్పించారు. అధికారిక నియామకం కోసం షర్మిల ఎదురు చూస్తున్నారు. షర్మిల కుమారుడి నిశ్చితార్థం ముగిసిన వెంటనే ఆమె బాధ్యతలు తీసుకుంటారు. అయితే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం షర్మిల కడప లోక్ సభ నుంచి లేదా పులివెందుల అసెంబ్లీ నుంచి పోటీ చేయాల్సి ఉంటుంది. ఒక వేళ ఆమె ఓడిపోతే కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపి పదవి ఇస్తారు. ఈ మేరకు చర్చలు జరిగాయని చెబుతున్నారు.
షర్మిల కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఖచ్చితంగా ప్రయత్నిస్తారు. ఈ కొద్ది రోజుల్లో ఆమె మార్చేదేమీ ఉండకపోవచ్చు కానీ రాజకీయంగా ఓ సంచలనం మాత్రం నమోదవుతుంది. జగన్ రెడ్డి తన కుటుంబాన్ని పూర్తిగా మోసం చేశారని అందుకే విడిపోయరన్న భావన ప్రజల్లోకి వెళ్లిపోతుంది. ఇప్పటికే ఆయన వ్యవహారశైలిపై ఎంతో మంది అసంతృప్తిగా ఉన్నారు. వారంతా టీడీపీలోకి వెళ్లలేరు. కానీ షర్మిల వైపు వెళ్లవచ్చు. అక్కడ గెలుస్తారా లేదా అన్న సంగతి పక్కన పెడితే.. రాజకీయంగా ఉనికి కాపాడుకునే అవకాశం ఉంటుంది. అదే జగన్ రెడ్డి వైపు ఉంటే… చాన్స్ ఉండదు.
మరో వైపు ఇప్పుడు విజయమ్మ ఏం చేస్తారన్నది కూడా వైసీపీలో చర్చ జరుగుతోంది. ఆమె కూతురికే మద్దతు పలికే జగన్ రెడ్డి నైతికంగా మరింత పతనమవుతారు. నేరుగా కాకపోయినా కొడుకు,కూతురులలో కూతురుతోనే రెండు, మూడు సార్లు బయట కనిపిస్ే అదే సందేశం వెళ్తుంది. జగన్ రెడ్డి మీ బిడ్డ.. బీ బిడ్డ అనే వేసే కేకల్లో కామెడీ బయటకు వస్తుంది. వైఎస్ కుటుంబ కథా చిత్రమ్ ఏపీ రాజకీయాల్లో రోడ్డున పడటానికి ఎన్నో రోజులు ఉండవని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.