ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను మాత్రమేనని ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు షర్మిల. అనేక అంశాలను ప్రస్తావిస్తూ ప్రజలను ఆలోచింపజేస్తున్నారు.
గత కొద్ది రోజులుగా సుతిమెత్తగా జగన్ పై విమర్శలు చేసిన షర్మిల ఇప్పుడు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. చంద్రబాబు డైరక్షన్ లో షర్మిల రాజకీయాలు చేస్తున్నారన్న జగన్ వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చారు. వేలమంది సభలో సొంత చెల్లెలు వేసుకున్న బట్టల మీద ఎవరైనా ప్రస్తావన చేస్తారా..? కానీ, జగన్ బాధ్యతాయుతమైన హోదాలో కొనసాగుతూ కూడా తాను వేసుకున్న బట్టలపై వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.
నేను పసుపు చీర కట్టుకుంటే తప్పేంటి..? పసుపు చీర కట్టుకుంటే చంద్రబాబు దగ్గర మోకరిల్లినట్లా..? పసుపు కలర్ పై చంద్రబాబుకు ఏమైనా పేటెంట్ రైట్ ఉందా..?అని జగన్ ను ప్రశ్నించారు. గతంలో సాక్షి ఛానెల్ కు కూడా పసుపు రంగు ఉండే విషయం జగన్ మర్చిపోయారా..? పసుపు మంగళకరం అని నాడు వైఎస్సార్ చెప్పారని షర్మిల జగన్ కు కౌంటర్ ఇచ్చారు.
తాను వైఎస్సార్ వారసులురాలినని.. ఎవరి దగ్గర మోకరిల్లాల్సిన అవసరం లేదని…వైఎస్సార్ వ్యతిరేకించిన బీజేపీ దగ్గర మోకరిల్లిన జగన్ వైఎస్సార్ వారసుడు కాదు. మోడీకి జగన్ దత్తతపుత్రుడు అని మండిపడ్డారు. వైఎస్సార్ పేరును సీబీఐ చార్జీ షీట్ లో చేర్చలేదని…జగన్ ను కేసుల నుంచి బయటపడేసేందుకు జగన్ తరఫు లాయర్ వైఎస్సార్ పేరును సీబీఐ చార్జ్ షీట్ లో చేర్పించాడని షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు.
వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని సేఫ్ చేసేందుకు జగన్ రెడ్డి ప్రయత్నించారని ఆరోపించిన షర్మిల… జగన్ పులివెందుల సభలో తనపై చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు జగన్ నేరుగానే ఎదుర్కొంటోంది. కేసుల నుంచి బయటపడేందుకు తండ్రిని కూడా బద్నాం చేశారనే తరహలో జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు షర్మిల. తాజాగా షర్మిల చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నాయి.
ముఖ్యమంత్రి హోదాలో నిండు సభలో వేల మంది మగవాళ్ల మధ్య చెల్లెలి చీర గురుంచి మాట్లాడటం ఇది సభ్యతా ? ఇది సంస్కారమా ? pic.twitter.com/DJ7TjQ4MsN
— YS Sharmila (@realyssharmila) April 26, 2024