సొంత పార్టీ పెట్టుకుని మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినా పార్టీ ఉందో లేదో అన్నట్లుగా మారిపోయింది షర్మిల రాజకీయం. ట్విట్టర్ ట్వీట్లు తప్ప మరేమీ రాజకీయ కార్యకలాపాలు కనిపించడం లేదు. కాంగ్రెస్ లో విలీనం అంటూ కొంత కాలం హడావుడ చేశారు. కాంగ్రెస్ సీనియర్లు మాత్రం ఆమె అసలు తెలంగాణ పార్టీకి అవసరం లేదని.. ఏపీకి అవసరం అయితే విలీనం చేసుకోవాలని తేల్చేశారు. దీంతో ఆమె విలీనం పెండింగ్ లో పడిపోయింది.
మరో వైపు ఆగిపోయిన పాదయాత్రను మళ్లీ ఎప్పుడు ప్రారంభించాలన్న దానిపై ఆమెకు క్లారిటీ లేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పాదయాత్ర చేయలేదు. అంతే కాదు.. పార్టీలో ఒక్కరంటే ఒక్క ప్రముఖ నాయకుడు కూడా లేరు. నియోజకవర్గ స్థాయి నేత కూడా లేరు. ఆమె పాలేరులో పోటీ చేయాలనుకుంటున్నారు. అక్కడ ఆమె కూడా నియోజకవర్గ స్థాయి నేతో కాదో ఎవరికీ తెలియడం లేదు. ఇటీవల వైఎస్ జయంతి రోజు సభ పెడితే రెండు వందల మందిని కూడా సమీకరించలేకపోయారు.
ప్రస్తుతానికి ఆమె పేరుతో మీద.. టీఆర్ఎస్ సర్కార్ ను విమర్శిస్తూ .. రోజుకో ట్వీట్ పెడుతున్నారు తప్ప..క్షేత్ర స్థాయిలో ఎలాంటి కార్యక్రమాలు లేవు. అన్ని పార్టీలు రాజకీయంగా యాక్టివ్ గా మారిపోయాయి. కానీ బరిలోకి దిగి ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో షర్మిల ఉండిపోయిన సూచనలు కనిపిస్తున్నాయి.