తెలంగాణలో ఇటీవల పార్టీ ఏర్పాటు చేసిన షర్మిల ప్రధానంగా యువత ఓట్ల పైనే ఫోకస్ చేస్తోంది. నిరుద్యోగుల కోసం ప్రతి మంగళవారం తాను దీక్షకు పూనుకుంటాను అని పార్టీ ఆవిర్భావ సభలో చెప్పిన విధంగా ఈరోజు నుండి దీక్షలు మొదలుపెట్టింది షర్మిల. వివరాల్లోకి వెళితే..
షర్మిల ఈ రోజు ఉదయాన్నే మహబూబ్ నగర్ జిల్లాలోని తాడిపత్రి గ్రామం చేరుకున్నారు. అక్కడ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి కుటుంబాన్ని పరామర్శించి, దీక్షకు కూర్చున్నారు. సాయంత్రం 6 గంటల వరకు ఈ దీక్ష కొనసాగిస్తానని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా యువత ఈ దీక్షకు హాజరై మద్దతు పలకాలని పార్టీ నేతలు ఇప్పటికే పిలుపు ఇచ్చినప్పటికీ, పార్టీ నాయకులు ఏర్పాటు చేసుకున్న కొందరు తప్ప పెద్దగా ఇతర ప్రాంతాల్లో యువత దీక్షకు తరలి రాలేదు. అంతే కాకుండా మొన్నీ మధ్య కెసిఆర్ త్వరలోనే 50 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని చెప్పగానే తాను గతంలో నిర్ల కోసం చేసిన దీక్ష కారణంగానే కేసీఆర్ లో చలనం వచ్చి ఈ ప్రకటన చేశాడు అని షర్మిల ప్రకటించుకున్నారు.
ఏదిఏమైనా ఆవిర్భావ సభ పూర్తిగా తేలిపోయిన దృష్ట్యా, తెలంగాణలో షర్మిల రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే నిరుద్యోగ యువతను గట్టిగా ఆకర్షించ గలిగితే తమ పార్టీ పటిష్ట పడుతుందన్న అభిప్రాయంతో షర్మిల ఉన్నట్లు కనిపిస్తోంది.