ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అధికార పార్టీ తర్వాత ఉండాల్సిన ప్రతిపక్ష పాత్రలో జగన్ రెడ్డి కనిపించడం తగ్గిపోయింది. అదే సమయంలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ప్రముఖంగా కనిపిస్తున్నారు. అధికారం పోయిన తర్వాత జనంతో పని లేదనుకుంటున్న జగన్ పూర్తిగా బెంగళూరుకు పరిమితమవుతున్నారు. ఎప్పుడైనా వచ్చినా రికార్డెడ్ ప్రెస్ మీట్లు వదిలి అది ప్రజాసమస్యలపై పోరాటం అంటున్నారు. కానీ షర్మిల అలా అనుకోవడం లేదు.
ఎక్కడ చూసినా షర్మిలే !
ఏపీలో సోషల్ మీడియా అరెస్టులు జరుగుతున్న సమయంలో వైసీపీ నేతలు గగ్గోలు పెట్టారు. కానీ నిందితులు వాళ్లే. తమ వాళ్లను రక్షించుకోవడానికి వారు చేసింది ఏమిటంటే రెండు సార్లు జైలుకెళ్లి పరామర్శించడం. ఒక సారి ప్రెస్మీట్ పెట్టడం. అంతే.. ఇంకా ఎక్కువ చేస్తే వారు పెట్టిన పోస్టులపై ప్రచారం జరుగుతుందని సైలెంటుగా ఉండిపోయారు. కానీ షర్మిల మాత్రం.. మరింత అగ్రెసివ్ గాదూసుకెళ్లారు. సోషల్ సైకోలను అరెస్టు చేయాలని.. సూత్రధారులను పట్టుకోవాలంటున్నారు. అదాని-జగన్ డీల్ విషయంలోనూ దూకుడుగా ఉన్నారు. గవర్నర్ ను కలిశారు. ఇలా ప్రతిపక్ష పాత్రను షర్మిల సమర్థంగా పోషిస్తున్నారు.
అసెంబ్లీకీ వెళ్లని నిరర్థక నేతగా జగన్
అసెంబ్లీకి వెళ్లని రాజకీయ నేతను ఎవరైనా విచిత్రంగా చూస్తారు. ఎందుకంటే రాజకీయనాయకుడి గమ్యస్థానం చట్టసభ. అలాంటిది జగన్ రెడ్డి తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని ఎగ్గొట్టేశారు. అసెంబ్లీలో వారి ఉనికి కనిపించలేదు. ఎంత మంది సభ్యులు ఉన్నా ప్రభుత్వంపై పోరాటానికి విపక్షాలకు అసెంబ్లీకి మించిన వేదిక ఉండదు. దాన్ని జగన్ రెడ్డి వదిలేసుకున్నారు.
జగన్కు ముందు ముందు మరిన్ని గడ్డు పరిస్థితులు
లంచాలు తీసుకుని అడ్డంగా దొరికిపోయిన జగన్ రెడ్డి ఇప్పుడు బెంగళూరులో ఆ గండం నుంచి ఎలా బయటపడాలా అని చర్చలు జరుపుతున్నారు. కానీ ఆయనపై అంతకు మించిన అవినీతి కేసులు రెడీగా ఉన్నాయి. ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని సొంత జాగీరులా చేసుకుని సిమెంట్ నుంచి మద్యం వరకూ ప్రతి విషయంలోనూ దోచుకున్న వైనం బయటపడబోతున్నాయి. ముందు ముందు ఆయన ప్రజల్లోకి రావడం కష్టమే. షర్మిలకు ఇదే మంచి చాన్స్.