షర్మిల వైసీపీ కోసం చేసిన పాదయాత్రను ఎవరూ మర్చిపోలేరు. మూడు వేల కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేశారు. మధ్యలో మోకాలి చిప్పకు ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. అయితే ఆమె పాదయాత్ర పూర్తి చేసి ఐదేళ్లయిన సందర్భంగా సాక్షి పత్రికలో ఫీచర్స్ ఎడిటర్ అయిన రామ్ రెడ్డి రెండు పేజీ ల స్పెషల్ ఆర్టికల్స్ ప్రింట్ చేయించాలనుకున్నారు. అయితే చివరి క్షణంలో విషయం తెలిసిన సాక్షి ఎండీ భారతిరెడ్డి తక్షణం వాటిని ఆపేయించడమే కాదు.. తర్వాత రామ్ రెడ్డిని గెంటేశారు.
ఇప్పుడు అలాంటి పరిస్థితే మరోసారి షర్మిలకు ఎదురవుతోంది. యాత్ర 2లో ఆమె క్యారెక్టర్ ను పూర్తిగా కత్తిరించేస్తున్నారు. జగన్ 2009 నుంచి 2019 మధ్య ఏం చేశారన్న దానిపైన కథ నడుస్తుంది. 2012 నుంచి వైఎస్ షర్మిల పాదయాత్ర చేసినా ఆమె గురించి చెప్పడం లేదు. నిజానికి చెప్పారు.. షూట్ చేశారు కూడా . కానీ ఇప్పుడా పాత్రను పూర్తిగా ఎడిట్ చేయాలని ఆర్డర్స్ వచ్చాయి. ఇప్పుడా పనిలో ఉన్నారు. ప్రచారం మాత్రం.. కేవలం తండ్రి కొడుకుల అనుబంధం మాత్రమే చూపిస్తామని చెప్పుకుంటున్నారు. ఇది విచిత్రంగా ఉంటోంది.
షర్మిల పాదయాత్ర చేసినట్లుగా చూపిస్తే ఆమె ఇమేజ్ ఎక్కడ రెట్టింపు అవుతుంది. అది జగన్ రెడ్డికి ఇష్టం లేదు. కానీ తమను హీరోలుగా కీర్తింప చేసుకోవడానికి తను ఈ స్థాయికి తీసుకు వచ్చిన కాంగ్రెస్ పైనా.. సోనియా పైనా నిందలు వేయడానికి మాత్రం రెడీ అయిపోతున్నారు. సొంత చెల్లికి అదీ కూడా పార్టీ కోసం పడిన కష్టానికి కనీసం క్రెడిట్ ఇవ్వడానికి ఆసక్తిగా లేరు.