ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎలాంటి మొహమాటలు పెట్టుకోకుండా రాజకీయం చేయాలని డిసైడయ్యారు. అందుకే ఆమె వైఎస్ లెగసీ కేంద్రంగానే రాజకీయాలు చేయనున్నారు. 21వ తేదీన ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆ కార్యక్రమం నేరుగా ఇడుపుల పాయ వైఎస్ సమాధి దగ్గరే చేయబోతున్నారు. దీంతో షర్మిల ఉద్దేశం చాలా స్పష్టంగా ఉందని క్లారిటీ వస్తోంది
జగన్ రెడ్డి కింద నుంచి ఎదగలేదు. తండ్రి కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అయితే ఆయన హఠాత్తుగా చనిపోతే.. ఆ సానుభూతిని వాడుకుని కాంగ్రెస్ పార్టీని నిండా ముంచేసి సొంత పార్టీ పెట్టుకుని ఆ ఓటు బ్యాంక్ ఆంతా తాను కొట్టేశారు. ఏపీలో కాంగ్రెస్ లేదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంది. అప్పట్లో వైఎస్ ఫ్యామిలీ అంతా కాంగ్రెస్ ను ముంచేశారు. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ లోకి వెళ్లి.. వైఎస్ ను కాంగ్రెస్కు సొంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ లెగసీనే తాను ఉపయోగించుకుని రాజకీయంగా ఎదగాలని డిసైడయ్యారు. పోటీ పడేది అన్నతోనా మరొకరితోనా అన్నదికాదు… రాజకీయంలోకి వస్తే వారంతా ప్రత్యర్థులే అని డిసైడ్ అయిపోయారు.
షర్మిలపై ఇప్పుడు ఎన్నో రకాల వేధింపులకు జగన్ రెడ్డి ప్రభుత్వం పాల్పడే అవకాశం ఉంది. అయినా షర్మిల వైఎస్ పై అభిమానం ఉన్న వారందర్నీ మళ్లీ కాంగ్రెస్ వైపు మళ్లించుకునేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. జగన్ రెడ్డి రాజకీయ అవసరాల కోసం బీజేపీతో సన్నిహితంగా ఉండటం వల్ల వైఎస్ ఫ్యాన్స్ ముఖ్యంగా దళితులు, ముస్లిం వర్గాల్లో అసంతృప్తి ఉంది. వీరిలో వచ్చే ప్రతి మార్పు జగన్ రెడ్డి పరాజయానికి మరింత దిగువ స్థాయికి తీసుకెళ్లబోతున్నాయి.