ఎప్పుడైనా రాఖీ పండుగ వస్తే.. వైసీపీ నేతలకు కానీ.. వైసీపీ మీడియాకు కానీ.. వారి అనుబంధ మీడియాకు కానీ జగన్- షర్మిల అనుబంధం చూపించడానికి స్పెషల్ ఎపిసోడ్లు వేసేవారు. షర్మిల, జగన్ మధ్య రాఖీ అనుబంధం లైవ్‌లో చూపించేవారు. రాఖీలు కట్టే ఫోటోలు వైరల్ అయ్యేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కానీ గత రెండేళ్ల నుంచి అది లేదు. వారి మధ్య దూరం పెరిగిందని మాటల్లేవని చెప్పుకుంటున్నారు. అది నిజమేననిపించేలా పరిస్థితులు ఉన్నాయి.
కనీసం సోషల్ మీడియాలో కూడా చెల్లి షర్మిలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు చెప్పలేదు. కానీ షర్మిల మాత్రం అన్న జగన్ పేరెత్తకుండా.. అందరితో కలిపి అయినా రాఖీ శుభాకాంక్షలు చెప్పారు. ” నా తోడబుట్టిన అన్నతోపాటు నా ఈ ప్రజాప్రస్థాన పాదయాత్రలో 1600 కిలోమీటర్ల పైగా నాతో నడిచి, నాకు దేవుడిచ్చిన తోబుట్టువుల్లా రక్షణగా నిలిచిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి రాఖీ పండుగ శుభాకాంక్షలు..” అని ట్వీట్ చేశారు. ఎక్కడా జగన్ పేరు రాయలేదు. అలాగే ట్వీట్‌ను కూడా జగన్‌కు ట్యాగ్ చేయలేదు.
వైఎస్ జగన్ కానీ..వైసీపీ కానీ ఎక్కడా షర్మిల పేరును రాఖీ పండుగ సంబరాల్లో తీసుకు రాలేదు. ప్రతీ సారి పెట్టో ఫోటోలు ఈ సారి కనిపించనీయలేదు. రాజకీయం వేరు.. వ్యక్తిగత సంబంధాలు వేరు. కుటుంబం వేరు. రాజకీయం కోసం వ్యక్తిగతం.. కుటుంబ సంబంధాలను కాలదన్నుకోకుండా ఎంతో మంది రాజకీయ నేతలు వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో సీఎం జగన్ మాత్రం వ్యక్తిగతంగా.. కుటుంబపరంగా కూడా సోదరికి దూరమైనట్లుగా కనిపిస్తోంది.