తెలంగాణలో టీడీపీ అభిమానుల్ని షర్మిల తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. కొద్ది రోజులుగా ఆమె.. ప్రకటనలు చూస్తూంటే.. ఎవరికైనా ఇదే సందేహం రాకుండా ఉండదు. మొన్నటికి మొన్న … కరోనా సంక్షోభ సమయంలో.. చంద్రబాబు లాంటి విజన్ ఉన్న నేత అధికారంలో ఉంటే.. పరిస్థితి వేరేగా ఉండేదని కామెంట్ చేశారు. ఇది తెలంగాణ ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకునే చేసినా.. ఏపీలో ఎక్కవగా చర్చనీయాంశమయింది. క్రైసిస్ టైమ్‌లో చంద్రబాబు డీల్ చేసే విధానంఈ సమయంలో చర్చకు వస్తోంది కాబట్టి… సహజంగా చేశారేమో అనుకున్నారు. అయితే ఎన్టీఆర్ జయంతి సందర్భంగా షర్మిల మరో ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ ను వేనోళ్ల పొగిడారు.
ఎన్టీఆర్ తెలంగాణలో ఆయన అమలు చేసిన సంస్కరణలు.. సంక్షేమ పథకాలను గుర్తు చేసుకున్నారు. దీంతో షర్మిల ఉద్దేశపూర్వకంగానే.. టీడీపీ ఫ్యాన్స్‌కు గిలిగింతలు పెట్టే ప్రకటనలు చేస్తున్నారని అర్థమైపోయింది. ఆమె తెలంగాణలో దాదాపుగా ఉనికి కోల్పోయిన టీడీపీ ్భిమానుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ ఓ వైపు సాగుతోంది. మరో వైపు… షర్మిల ప్రకటనలు.. ఏపీలోని వైసీపీ నేతలకు ఇబ్బందికరంగా మారాయి. షర్మిల వ్యాఖ్యలను టీడీపీ నేతలు… సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేయడానికి ఉపయోగించుకుంటున్నారు.
నిజానికి ఏపీలో వైసీపీకి ఇబ్బంది అవుతుందని… తన పార్టీ వ్యూహాలను అమలు చేయకూడదన్న ఆలోచనలో షర్మిల లేరు. అందుకే.. పక్కా వ్యూహంతోనే.. చంద్రబాబు, ఎన్టీఆర్‌లపై ప్రశంసలు గుప్పిస్తున్నారని.. అంటున్నారు. కరోనా కారణంగా షర్మిల ప్రత్యక్షంగా తన పార్టీ ఏర్పాటు కార్యక్రమాలకు బ్రేక్ ఇచ్చారు. ాకనీ పార్టీ ఏర్పాటు.. తదనంతరం చేయాల్సిన వ్యవహారాలపై నిరంతరం పార్టీ నేతలతో చర్చిస్తూ.. వ్యూహాలు ఖరారు చేస్తున్నట్లుాగ చెబుతున్నారు.