హీరో గోపీ చంద్ తో ఎక్కువగా సినిమాలు తీసే భవ్య క్రియేషన్స్ సంస్థ ఆయనతో తీసిన ‘సౌఖ్యం’ సినిమా ఫ్లాప్ అవడంతో చాలా నష్టపోయింది. అప్పటి నుండి కొన్ని రోజులు విరామం తీసుకొన్న ఆ సంస్థ త్వరలో మళ్ళీ మరో సినిమా తీయడానికి సిద్దం అవుతోంది. ఈసారి ఆ సినిమాకి గోపీ చంద్ కి బదులు శర్వానంద్ ని ఎంచుకోన్నట్లు తాజా సమాచారం. ఈ ఏడాది జనవరిలో విడుదలయిన ‘ఎక్స్ ప్రెస్ రాజా’ సినిమాతోనే హిట్ కొట్టి శర్వానంద్ మంచి జోరు మీద ఉన్నారు. అతనితో చాలా లో-బడ్జెట్ లో ఒక మంచి సినిమాను తీసి తన నష్టాలను పూడ్చుకోవాలని భవ్య క్రియేషన్స్ సంస్థ ఆలోచిస్తున్నట్లు తాజా సమాచారం. ఈ సినిమా హీరోయిన్, ఇతర పాత్రలకి ఇంకా ఎంపిక మొదలుపెట్టలేదు. జూన్ తరువాత ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టి దసరా, దీపావళి పండుగ సీజన్ లో విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.