సినిమా ఫలితం తేడా కొడితే నిర్మాత కుదేలయిపోతారు. అలాంటపుడు చాలా మంది హీరోలు మరో సినిమా చేస్తాం అని ‘మాట’ ఇస్తారు. కానీ ఆ మాట నిలబెట్టుకునేది మాత్రం చాలా తక్కువగా కనిపిస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇలాంటి మాటలు చాలా ఇచ్చారు. కానీ సినిమాలే కనిపించవు. అది వేరే సంగతి. అలా వున్నమాటంటే అభిమానులకు కోపం వస్తుంది. బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాలు రెండింటికీ మాట ఇచ్చారు. ఇంతవరకు ఆ నిర్మాతలకు సినిమాలు లేవు.
ఇక విషయానికి వస్తే ఇటీవల పడి పడి లేచె మనసు అనే సినిమా వచ్చింది. సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా ఫేర్ చేయలేదు. నిర్మాత సుధాకర్ కాస్త గట్టిగానే నష్టపోయారు. అందుకే హీరో శర్వానంద్ తన తరువాత సినిమా మళ్లీ ఆయనకే చేయాలని డిసైడ్ అయినట్లు బోగట్టా.
ప్రస్తుతం చేస్తున్న సుధీర్ వర్మ సినిమా అయ్యాక, దిల్ రాజు నిర్మాణంలో 96 సినిమా వుంటుంది. ఆ తరువాత మళ్లీ సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో సినిమా చేస్తారు. దీనికి డైరక్టర్ గా చందుమొండేటి వుండే అవకాశం వుంది. ఇది కూడా లవ్ స్టోరీనే.