తమిళంలో విజయ్ సేతుపతి-త్రిష కాంబినేషన్ లో వచ్చిన పెద్ద హిట్ 96. ఈ సినిమా ఇప్పుడు తెలుగులో దిల్ రాజు రీమేక్ చేస్తున్నారు. సమంత-శర్వానంద్ కీలక పాత్ర ధారులు. ఈ సంగతులు అన్నీ తెలిసినవే.
అయితే ఇక్కడ కొత్త విషయాలు ఏమిటంటే, తెలుగులో టైటల్ 96 అని వుంటుందా? వుండకపోవడానికే ఎక్కువ చాన్స్ వుంది. ఎందుకంటే 2019లో 96 సినిమా అంటే దాదాపు ఇరవై ఏళ్ల వెనక్కు వెళ్లి తీయాలి. ఇప్పుడున్న శర్వానంద్ ను 20 ఏళ్ల కిందటి కుర్రాడిగా చూపించాలి అంటే ఎలా? మరీ మీసాలు రాని కుర్రోడిగా చూపించలేరు కదా?
మహా అయితే పదేళ్ల కిందట సినిమాగా అంటే 2009 సినిమాగా తీస్తే, అప్పుడు శర్వాను నూనూగు మీసాల నూత్న యవ్వనుడిగా చూపించవచ్చు. అందుకే ఆ ఒక్క మార్పుచేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలినంతా సేమ్ టు సేమ్. కథ, కథనం, టెక్నీషియన్లు వగైరా వగైరా..
మార్చి నుంచి ఏకథాటిగా షూటింగ్ జరుపుకుని జూలై విడుదల టార్గెట్ గా ముందకు వెళ్తుంది ఈ సినిమా. అయితే ఒకటే కండిషన్. సుదీర్ఘకాలంగా సాగుతున్న శర్వానంద్-సుధీర్ వర్మ సినిమా ముందు పూర్తి కావాలి. ఈ సినిమా మే లో విడుదల టార్గెట్ గా రెడీ అవుతోంది.