శర్వానంద్ కొత్త సినిమాకి ఈ రోజు క్లాప్ పడింది. రామానాయుడు స్టుడియోస్ లో పూజకార్యక్రమలతో మొదలైయింది. హను రావిపూడి ఈ సినిమాకి దర్శకుడు. అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకునాడు హను రాఘవపూడి. అందాల రాక్షసితో తన డెప్త్ చూపించి.. ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’తో ఓ పైసా వసూల్ సినిమాని అందించాడు హను. ఐతే ఈ మధ్య నితిన్ తో చేసిన ‘లై’ సినిమా మాత్రం నిరాశ పరిచింది.
ఇప్పుడు మళ్ళీ శర్వానంద్ కోసం తనదైన జోనర్ లో ఓ ప్యూర్ లవ్ స్టోరీని రాసుకున్నాడు హను. అటు శర్వానంద్ వరుస హిట్లతో జోరుమీద వున్నాడు. రన్ రాజా రన్ నుండి మొదలుపెడితే .. మహానుభావుడు వరకూ విజయాలే. ఇప్పుడు హను సినిమా కధపై కూడా పూర్తి నమ్మకంగా వున్నాడు. ఈ సినిమా ఖచ్చితంగా తనను మరో మెట్టు ఎక్కించే సినిమా అవుతుందని నమ్మకంగా వున్నాడు శర్వా. ఇందులో ఫిదా భామ సాయి పల్లవి హీరోయిన్ కావడం మరో ఆకర్షణ. చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుంది సాయి పల్లవి. హను చెప్పిన కథ నచ్చేయడంతో మరో ఆలోచన లేకుండా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.