శర్వానంద్ తాజా చిత్రం పడి పడి లేచె మనసు చిత్రానికి సంబంధించిన శాటిలైట్ హక్కులు రికార్డ్ స్థాయికి అమ్ముడుపోయినట్లు తెలిసింది. హను రాఘువపూడి దర్శకత్వ వహించిన ఈ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ బజ్ ఏర్పడింది. ట్రైలర్‌కు నెటిజన్లు ఫిదా అయిపోవడంతో రికార్డ్ స్థాయిలో వ్యూస్ లభించాయి. మొత్తంగా ఈ సినిమాపై ట్రేడ్ వర్గాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు శాటిలైట్ హక్కుల్ని మా టీవీ సొంతం చేసుకుంది. ఇక శాటిలైట్‌తో పాటు అమెజాన్, హిందీ డబ్బింగ్ మొత్తం కలుపుకొని 12కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఇది శర్వానంద్ కెరీర్లోనే ఓ రికార్డుగా భావిస్తున్నారు.