అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ, లై…. ఇలా వెరైటీ టైటిళ్లతో ఆకట్టుకున్నాడు హను రాఘవపూడి. ఇప్పుడు శర్వానంద్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి కూడా ఓ రొమాంటిక్ టైటిలే అనుకుంటున్నట్టు టాక్. ఈ చిత్రానికి ‘పడి పడి లేచె మనసు’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. దాదాపుగా ఇదే ఖాయమైపోయే అవకాశాలున్నాయి. ఇదో రొమాంటిక్ లవ్ స్టోరీ అని, ట్రీట్మెంట్ మాత్రం చాలా కొత్తగా ఉండబోతోందని తెలుస్తోంది. లై ఫ్లాప్ తో ప్రయోగాల జోలికి వెళ్లకూడదని డిసైడ్ అయ్యాడు హను. అందుకే.. క్లీన్ అండ్ నీట్ స్టోరీతో వస్తున్నాడట. ఈ కథపై శర్వా చాలా నమ్మకంగా ఉన్నాడని, హనుకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడని, ఈ టైటిల్ కూడా శర్వానికి బాగా నచ్చిందని తెలుస్తోంది.