శర్వానంద్ కెరీర్లో అత్యధిక వసూళ్లు తెచ్చుకున్న సినిమా `మహానుభావుడు`. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మెహరీన్ నాయిక. ఈ చిత్రం ఇప్పుడు హిందీకి వెళ్లబోతోంది. అన్నీ కుదిరితే.. ఈ సినిమాకి మారుతినే దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి. “హిందీలో ఈ సినిమా చేయమని ఇద్దరు కథానాయకులు అడుగుతున్నారు. నిర్మాణ సంస్థలు కూడా రెడీ గా ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమా విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటా” అంటున్నాడు మారుతి. అప్పట్లో `ప్రేమకథా చిత్రమ్` సినిమానీ హిందీలో రీమేక్ చేయమని అడిగారు. కానీ తెలుగులో బిజీగా ఉండడం వల్ల మారుతి ఆ ప్రాజెక్టుని ఒప్పుకోలేదు. ఈసారి మాత్రం… అవకాశాన్ని వదులుకోకూడదని మారుతి ఫిక్సయ్యాడు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వస్తాయి.