శర్వానంద్ దూకుడుమీదున్నాడు. `96` రీమేక్ సెట్స్‌పై ఉంది. `శ్రీకారం`కూడా రెడీ అవుతోంది. ఈలోగా మరో సినిమాని పట్టాలెక్కించేశాడు. శ్రీ కార్తీక్ అనే కొత్త కుర్రాడి కథకు శర్వా ఓకే చెప్పాడు. ప్రకాష్‌బాబు, ప్రభు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ఈరోజే లాంఛనంగా ప్రారంభమైంది. కథానాయికగా పెళ్లిచూపులు ఫేమ్ రీతూ వర్మని ఎంచుకున్నారు. ప్రేమ, స్నేహం నేపథ్యంలో సాగే చిత్రమిది. దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి సంభాషణలు అందిచడం విశేషం. త్వరలోనే చెన్నైలో చిత్రీకరణ ప్రారంభిస్తారు. వెన్నెల కిషోర్, నాజర్, ప్రియదర్శి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. 2020 వేసవికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. సంక్రాంతికి `శ్రీకారం` విడుదల కానుంది. అంటే.. `శ్రీకారం` విడుదలైన మూడు నెలల్లో మరో సినిమా వచ్చేస్తుందన్నమాట. మరి `96` ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి.